దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం

7 Jan, 2017 23:41 IST|Sakshi

తెలుగుభాషను  మృతభాషగా మార్చేందుకు కుట్ర
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


విజయవాడ (గాంధీనగర్‌) : దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందని, దానిని పరిరక్షించుకోవాలంటే విద్యార్థులు, యువకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటర్లుగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక హక్కుల వేదిక పేరుతో  హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో శుక్రవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు అధ్యక్షత వహించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలకులు గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించిన నిధులు ఖర్చు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతన్నారని ఆరోపించారు. ఈ వర్గాలకు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేస్తే పాఠశాలలు, హాస్టళ్లను మూసివేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. హాస్టళ్లు, పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు తెలుగు మీడియం రద్దుకు పూనుకున్నారని విమర్శించారు. మాతృభాషను మృతభాషగా మార్చి, బడుగు వర్గాలను విద్యకు దూరం చేసేందుకు కుట్రపన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు.

ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తున్న దృష్ట్యా ఆ రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌ సాధనకు విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పి.జె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధనకు పాటుపడుతున్న సామాజిక హక్కుల వేదిక అండగా విజయవాడ (గాంధీనగర్‌) : దేశంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందని, దానిని పరిరక్షించుకోవాలంటే విద్యార్థులు, యువకుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాల చేతుల్లోనే రాజ్యాధికారం ఉందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఓటర్లుగానే మిగిలిపోతున్నారని పేర్కొన్నారు.

అఖిల భారత యువజన సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రి, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిచంద్ర, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.విశ్వనాథ్, మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గాభవానీ ప్రసంగించారు.

మరిన్ని వార్తలు