సృజనకు స'వాల్'

26 Aug, 2016 23:08 IST|Sakshi
సృజనకు స'వాల్'

అందంగా అలంకరణ చేసుకునే వీలుండగా, బోసి పోయినట్టుగా ఉండాల్సిన పనేంటి? ఖాళీ కాన్వాస్‌గా ఉండే బదులు రకరకాల బొమ్మలతో నింపేస్తే సరి! ఇంతకీ అంత ఖాళీగా ఉండే కాన్వాస్‌ ఏంటంటే.. అవి మాఇంటిగోడలు అంటున్నారు సిటీజనులు. కంప్యూటర్‌ టేబుల్, స్విచ్‌ బోర్డ్, బెడ్‌ల్యాంప్‌ ఉన్న మూల, బెడ్‌ ఆనుకుని ఉన్న గోడ ఇలా ఇంట్లో ఏ చోటుని అయినా చక్కటి కాన్వాస్‌గా మార్చి కొత్త లుక్‌ ఇచ్చేస్తున్నారు. పక్షులు, చెట్లు, నక్షత్రాలు, సీతాకోక చిలుకలు, గార్డెన్‌ టు గ్యాలెక్సీని తెచ్చి ఇంటి గోడగా మార్చేస్తున్నారు.
                                                       – సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

ఇంటి గోడలు ఇంటికి రక్షణగానే కాదు.. అభిరుచికి అద్దంగా కూడా నిలుస్తున్నాయి. నగరంలోని నివాసాలు చాలా వరకు అపార్ట్‌మెంట్లు.. అందులో వార్డ్‌రోబ్‌లు, ఫర్నీచర్‌ పోనూ ఒక ఖాళీ గోడను అలాగే అట్టి పెట్టుకుంటున్నారు. దాన్ని వాల్‌ హ్యాంగిగ్స్, పెయింటింగ్స్‌తో అలంకరిస్తున్నారు. మొత్తం మీద తమ అలంకరణాభిలాషను అలా తీర్చుకుంటున్నారు. అయితే గోడలను మరింత అందంగా అలంకరించుకోవచ్చునని అంటున్నారు అభిరుచి కలవారు.

థీమ్‌ డెకర్‌...
నచ్చిన థీమ్‌లను ఇంటి గోడలపై చిత్రించుకోవచ్చు. ‘వాల్‌ డెకల్‌/వాల్‌స్టిక్కర్‌’ పేరుతో పాపులర్‌ అయిన ఈ ఇంటీరియర్‌ డిజైన్లు సిటీలో ఇప్పుడు బాగా పాపులర్‌. వీటిని ఎలా తయారు చేసుకోవాలి? వేసుకోవాలి? అనే వీడియోలు యూట్యూబ్‌లో ఎన్నో లభిస్తాయి. ఒకవేళ ఇంటి యజమాని ఆర్టిస్ట్‌ అయితే తనే చక్కని చిత్రాన్ని వేసుకోవచ్చు. అలా వేసుకోలేని వారికి ఆన్‌లైన్‌ సర్వీస్‌లు, స్టిక్కర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సర్వీసులు నేరుగా మన సిటీలో దొరుకుతున్నాయి.

అభిరుచికి తగ్గట్టుగా తయారు చేసుకోవడం లేదా చేయించుకోవడం ఏదైనా సులువే. అయితే ఖాళీ గోడలను అందంగా చూసుకోవాలనే ఆసక్తి ఉంటే స్వయంగా ఈ స్టిక్కర్స్‌ తయారు చేసుకోవచ్చు. వ్యయప్రయాసలకు ఓర్చుకునే సత్తాను బట్టి వాల్స్‌ని క్రియేటివ్‌గా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంది.

అలంకరణకు సూచనలు...
గ్రాఫిక్స్, ఫొటో ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లపై అవగాహన ఉంటే స్వతహాగా డిజైన్‌లు తయారు చేసుకోవచ్చు. వినైల్‌ పేపర్‌ మీద ప్రింట్‌ తీసి, కత్తిరించి, జాగ్రత్తగా గోడలకు అతికించాలి. మార్కెట్లో వాల్‌ స్టిక్కర్స్‌ లభ్యమవుతున్నాయి. వీటి ధర రూ.300 నుంచి ఉంటుంది.

మరిన్ని వార్తలు