క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

9 May, 2017 22:19 IST|Sakshi
క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌
కర్నూలు:  కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని ఎస్వీఆర్‌ లాడ్జి సమీపంలో బహిరంగ ప్రదేశంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న తుపాకుల ఆంజనేయులు, షేక్‌ ఇర్ఫాన్‌ను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని చింతలముని నగర్‌కు చెందిన ఆంజనేయులు, పాతబస్తీలోని పెద్దమార్కెట్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇర్ఫాన్‌ ముఠాగా ఏర్పడి నెట్‌ ద్వారా భజరంగ్‌ అనే యాప్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సన్‌రైజర్స్‌ హైదరబాదు ‘ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య ఆన్‌లైన్‌ ద్వారా క్రికెట్‌ బెట్టింగ్‌ జరుపుతుండగా పక్కా సమాచారం మేరకు సీఐ డేగల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్‌ కిషోర్‌ రెడ్డి, సిబ్బంది మద్దీశ్వర్, సుంకన్న, వరకుమార్, కృష్ణ, అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి బెట్టింగ్‌ ముఠాను అరెస్టు చేయడమే కాకుండా డబ్బు రికవరీ చేసినందుకు సిబ్బందిని డీఎస్పీ రమణమూర్తి అభినందించారు.    
 
మరిన్ని వార్తలు