నేరాల నియంత్రణకు కృషి

2 Jan, 2017 22:36 IST|Sakshi
నేరాల నియంత్రణకు కృషి

► సీపీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌
► పోలీస్‌ కమిషనరేట్‌లో  నూతన సంవత్సర వేడుకలు


గోదావరిఖని : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో ఆదివారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచారు. 2017 సంవత్సరంలో నేరాల నియంత్రణకు మరింత కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి, మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, మంచిర్యాల ఏసీపీ చెన్నయ్య, పెద్దపల్లి ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు వెంకటేశ్వర్, దేవారెడ్డి, వాసుదేవరావు, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ సుందర్‌రావు పాల్గొన్నారు. హెచ్‌ఎంఎస్‌ యూనియన్  ఆధ్వర్యంలో జరిగిన మరో కార్యక్రమంలో సీపీ కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, నాయకులు యాదగిరి సత్తయ్య, షబ్బీర్‌అహ్మద్, అజీజ్, హబీబ్‌బేగ్, పినకాశి మొగిలి పాల్గొన్నారు.  

అనాథ పిల్లలతో కలిసి..
కోల్‌సిటీ :  గోదావరిఖని గాంధీనగర్‌లోని ఎండీహెచ్‌డబ్ల్యూఎస్‌ అనాథ పిల్లల ఆశ్రమంలో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ శనివారం రాత్రి న్యూ ఇయర్‌ కేక్‌ కట్‌చేసి, పిల్లలకు మిఠాయి, పండ్లు పంపిణీ చేశారు. పిల్లల మధ్య వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సీపీ వెల్లడించారు. అనాథ పిల్లలను ప్రోత్సహించానికి అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో వన్ టౌన్  సీఐ వెంకటేశ్వర్, ఎస్సై దేవయ్య, ఆశ్రమ నిర్వాహకుడు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ రూల్స్‌పై పోస్టర్‌ ఆవిష్కరణ
గోదావరిఖని : జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సం దర్భంగా ట్రాఫిక్‌ రూల్స్‌కు సంబంధించిన పోస్టర్‌ను కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ ఆదివారం రాత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసో టీం ఇండియా అధ్యక్షుడు ఘనశ్యామ్‌ ఓజా, సభ్యులు హిర్సాద్, సిరాజ్, సమద్‌ బాజుమల్, సలీం, తిరుపతి, అయోధ్య రవి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు