అక్రమాలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు

4 Aug, 2017 21:39 IST|Sakshi

- ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీపై జేడీ శ్రీరామ్మూర్తి విచారణ
ఓడీ చెరువు: ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీలో అవకతవకలకు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని వ్యవసాయశాఖ జిల్లా సహాయ సంచాలకులు (జేడీఏ)శ్రీరామ్మూర్తి వెల్లడించారు. శుక్రవారం ఓడీ చెరువులో పర్యటించిన ఆయన...ఇన్‌పుట్‌ సబ్సిడీ జాబితాలో చోటు చేసుకున్న డమ్మీ ఖాతాలకు సంబంధించి విచారణ చేపట్టారు. చాలా ఖాతాలకు డమ్మీ ఖాతా నంబర్‌ నమోదు చేసి ఉండడంపై  ఏడీఏ రాంసురేష్‌పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇనగలూరు, కొండకమర్ల, మామిళ్లకుంట్లపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు పరిహారం జాబితాలో జరిగిన తప్పులు,  బినామీ ఖాతాల గురించి జేడీఏ దృష్టికి తెచ్చారు. బ్యాంకు ఖాతాల్లో జమ అయిన పరిహారం కూడా రైతులకు అందకుండా నిలిపి ఉంచినట్లు రైతులు వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన జేడీఏ... ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టామన్నారు. పరిహారం పంపిణీలో జరిగిన తప్పులను ఈనెల 18లోగా సరి చేసి రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే  ఇప్పటికే రైతు ఖాతాల్లో జమ అయిన మొత్తాలను వెంటనే అందేలా చూడాలని ఏడీఏను ఆదేశించారు.

మరిన్ని వార్తలు