విమర్శలతో సరి

25 May, 2017 01:59 IST|Sakshi
విమర్శలతో సరి
కొవ్వూరు/కొవ్వూరు రూరల్‌ : తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నేతల ప్రసంగాలకే పరిమితమైంది. ప్రతిపక్షంపై విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై ఏ విధమైన చర్చ చేపట్టలేదు. కొవ్వూరులో ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 1.55 గంటల వరకు సాగింది. నేతలు ముందు నుంచి ఇరవై ఐదు వేల మంది హాజరవుతున్నారని ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆశించినస్థాయిలో జనం హాజరు కాలేదు. పైగా సభ ప్రారంభమైన కొద్ది సేపటికే భోజనాలు ప్రారంభం కావడంతో జనం భోజనాలకు వెళ్లి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. దీంతో గంట ఆలస్యంగా ప్రారంభమైన సమావేశంను మూడు గంటల్లోనే ముగించారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌ మాట్లాడుతూ ఎ¯ŒSటీఆర్‌ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఈయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. జిల్లా ఇ¯ŒSచార్జ్‌ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అధికారులు కార్డుదారులను ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలు ఇష్టమైన వాళ్లు చేతులెత్తండి... అనగానే ఒక్క చెయ్యి లేవకపోవడంతో మంత్రి విస్తుపోయారు. దీనిపై తక్షణమే కలెక్టర్, జేసీలతో మాట్లాడాతానన్నారు. అధికారులు ఈ వి«ధానంపై ఒత్తిడి చేస్తే సస్పెండ్‌ చేయిస్తామని హెచ్చరించారు. డీలర్లు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌ సీపీ నేత నారాయణ రెడ్డి హత్య కేసులో చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, ఆయన కుమారుడిపై ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ సీబీఐ విచారణ కోరడంలో అర్థం లేదన్నారు. మంత్రి పితాని సత్యనారాయణ కేవలం సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి ప్రసంగం ముగించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఐదు సార్లు తనకు జిల్లా సారథి పగ్గాలు అప్పగించడమే నిదర్శమని అన్నారు. ఎంపీ మాగంటి బాబు (వెంకటేశ్వరావు)మాట్లాడుతూ కొల్లేరు అంటే తనకు ఎంతో ఇష్టమని, కానీ అక్కడ ప్రజలకు తాము ఏం చేయగలుగుతున్నామంటే సమాధానం లేదన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు మనరాష్ట్రానికి వచ్చాయన్నారు. రానున్న రోజుల్లో నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. స్థానిక నేతలు అతిథులకు శాలువాలు కప్పి జ్జాపికలు అందజేశారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ చింతమనేని ప్రభాకరరావు కేవలం పది నిమిషాలుండి ప్రసగించకుండానే వెళ్లిపోయారు. మాజీ మంత్రి పీతల సుజాత ఒక నిమిషం మాట్లాడి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నరసారపురం ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, జెడ్పీ చైర్మ¯ŒS ముళ్లపూడి బాపిరాజు, రాజమõßహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీ మోహ¯ŒSలు విదేశీ పర్యటనలో ఉండడంతో హాజరు కాలేదు. గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సోదరుడు మృతి చెందారు. దీంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు. పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, వేటుకూరి శివరామరాజు, నిమ్మల రామానాయుడు, బురుగుపల్లి శేషారావు, గన్ని వీరాంజనేయులు, మొడియం శ్రీనివాసరావు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి ఆంజనేయులు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహ¯ŒSరావు, మంతెన సత్యనారాయణ రాజు, ఎంఏ షరీఫ్, పార్టీ నేతలు పెండ్యాల అచ్చిబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈలినాని, అంబికా కృష్ణ, పాలి ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్బ రాయ చౌదరి, మునిసిపల్‌ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధా రాణి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
 
ఐదు అంశాలపై తీర్మానం
lవ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచి రైతులను బలోపేతం చేయాలి. 
lజిల్లాలో పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, జీవన ప్రమాణాలు మొరుగుపర్చడం.
lపర్యావరణానికి నష్టం కలగకుండా ఆక్వా కల్చర్‌ను అభివృద్ధి చేయడం, తద్వారా ఉపా«ధి అవకాశాలు మెరుగుపరచడం.
lఅభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు బలహీన వర్గాలకు అందేలా చర్యలు తీసుకోవడం.
lరాష్ట్రానికి వచ్చే జాతీయ సంస్థలను జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.  
 
మరిన్ని వార్తలు