క్యాబేజీ మట్టిపాలు

20 Dec, 2016 20:01 IST|Sakshi
క్యాబేజీ మట్టిపాలు

చల్లపల్లి : పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు..అమ్ముకుందామంటే మార్కెట్‌ సౌకర్యం లేదు..పంటను ట్రాక్టర్‌తో దున్నేందుకు సిద్ధమయ్యాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్లముందే మట్టిలో కలిసిపోతుండటంతో గుండె బరెవెక్కింది. ఇంటికి వెళ్లిపోయాడు. చక్కని క్యాబేజీ కాయలు ట్రాక్టర్‌ కింద పడి నలిగిపోతుంటే చూసిన స్థానికులు కొందరు పరుగున వచ్చారు. నాలుగు కాయలు కోసి పేదవారికి పంచిపెడతామని కోరటంతో ఆ రైతు అంగీకరించాడు. అప్పటికే ఎకరంన్నర మేర పంట నుజ్జునుజ్జవగా, మిగిలిన పంటను  స్థానికులు కోసుకెళ్లారు. చల్లపల్లికి చెందిన రైతు పిన్నమనేని పాండురంగారావు (పసి) రెండు ఎకరాల పొలం రూ.46వేలు నగదు కౌలుకు తీసుకుని రూ.80వేలు పెట్టుబడితో క్యాబేజీ పండించారు. కానీ మార్కెట్‌లో ఎటు చూసినా కూలీ, రవాణా ఖర్చులకు కూడా డబ్బు రాని పరిస్థితి కనిపించింది. మంగâళవారం పంటను ట్రాక్టర్‌తో తొక్కించేశారు. మిగిలింది ఉచితంగా ఇచ్చేశారు.


 

మరిన్ని వార్తలు