కోట్లల్లో చెత్త వ్యాపారం–వేలాదిమందికి ఉపాధి

3 Oct, 2016 17:29 IST|Sakshi
కోట్లల్లో చెత్త వ్యాపారం–వేలాదిమందికి ఉపాధి
భీమవరం :
   చెత్తే కదా అని చిన్నచూపు చూపతున్న చిత్తు కాగితాలు, పాతసీసాల వ్యాపారం వేలాదిమందికి ఉపాధి చూపుతోంది. నిత్యం కోట్లాది రూపాయల టర్నోవర్‌ సాగుతున్న ఈ వ్యాపారం ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెడుతోంది. జిల్లాలోని వివిధ పట్టణాలు, మేజర్‌ గ్రామాల్లో పాత పేపర్లు, ఇనుము, సీసాల వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లాలో సుమారు 150 పాత ఇనుము, పాత పేపర్లు, సీసాలు వంటివి కోనుగోలుచేసే పెద్దపెద్ద షాపులున్నాయి. వీటి ద్వారా జిల్లాలో ఏడాదికి సుమారు రూ.800 కోట్లు వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. వీటిలో సుమారు పది వేలమంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతుండగా వీటిపై ఆధారపడి పరోక్షంగా మరొక 25వేల మంది జీవిస్తున్నారు. ప్రతిరోజు  రూ.రెండు కోట్లు వ్యాపారం జరుగుతున్నట్లు అంచనా.  ప్రధానంగా భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు,పాలకొల్లు, ఆకివీడు, పెనుగొండ, కొవ్వూరు, నరసాపురం, మార్టేరు తదితర ప్రాంతాల్లో పాత చిత్తుకాగితాలు, సీసాలు, ఇనుము కొనుగోలుచేసే పెద్దపెద్ద షాపులున్నాయి. ఇవి గాకుండా అనేక  గ్రామాల్లో సైతం చిత్తుకాగితాలు, అట్టపెట్టెలు, పాతసీసాలు, ఇనుము కొనుగోలు చేసే చిన్నచిన్న షాపులున్నాయి.
–వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున వ్యాపారం....
   చిత్తుకాగితాలే కదా అంటూ చిన్నచూపు చూసే పాత పేపర్లు, అట్టలు, ఇనుము, సీసాలు  వ్యాపారం జిల్లాలో వేలాదిమందికి జీవనోపాధి కల్పిస్తోంది. నిత్యం రోడ్లు వెంబడి ఉండే చిత్తుకాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలు ఏరుకుంటు వందలమంది కన్పిస్తారు.అలాగే సైకిళ్లుపై తిరిగి అట్టపెట్టెలు, మద్యం సీసాలు, పాత ఇనుము కొనుగోలు చేసుకుని కొంతమంది జీవనోపాధి పొందుతున్నారు. ఇంకా అనేకమంది వీటిని కొనుగోలుచేసే షాపుల్లో పనిచేస్తున్నారు. వీరు షాపులకు వచ్చే మద్యం సీసాలను శుభ్రం చేయడం, కేటాయించడం, కాగితాలు, అట్టపెట్టెలు వేరుచేయడం వంటివి చేస్తుంటారు. అంతేగాకుండా షాపుల యజమానులు కొనుగోలుచేసిన వీటిని  హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కడియం, తణుకు వంటి ప్రాంతాలకు పంపించిడానికి లారీలోఎగుమతులుచేయడానికి జట్టు కూలీలు పెద్దసంఖ్యలోనే పనిచేస్తున్నారు.
–రోజుకు రూ. రెండు కోట్లు వ్యాపారం....
   జిల్లాలో చిత్తుకాగితాలు,అట్టపెట్టెలు, పాత ఇనుము, మద్యం సీసాలు వంటివి కోనుగోలు వ్యాపారం రోజుకు రూ.రెండు కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఒక్క భీమవరం  పరిసర ప్రాంతాల్లో సుమారు 25 షాపుల ద్వారా  రోజుకు 30 టన్నుల వరకు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిలో పాత ఇనుము మూడు లారీలు, సీసాలు అయిదు లారీలు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వీటి కొనుగోలు,అమ్మకాలు ద్వారా రూ.రెండు కోట్లుకు పైగానే లావాదేవిలు జరుతున్నట్లు చెబుతున్నారు. 
–ధరలో ఇలా ఉన్నాయి...
  చెత్త కాగితాలు, అట్టపెట్టెలు, మద్యం సీసాల ధరలు దాదాపు అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటున్న కొంతమంది అవకాశాన్ని బట్టి ధరలను పెంచడం, తగ్గిస్తుంటారు.  గతంలో మద్యం సీసాలు చిన్నవి రెండు రూపాయలు, పెద్దవి రూ. అయిదుకు కొనుగోలు చేయగా ప్రస్తుతం బీరు సీసాలు వంటివాటిని కేవలం రూపాయిన్నరకే కొనుగోలు చేస్తుండగా చిన్నసీసాలను రూపాయికి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.పండ్లు, మద్యం సీపాలు వంటివాటి ప్యాకింగ్‌కు ఉపయోగించే అట్టపెట్టెలను కిలో రూ. 7, పాత పేపర్లు కిలో రూ.8 కొనుగోలు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ సీసాలు ఇతర ప్లాస్టిక్‌ వస్తువులను కిలో రూ.10 కొనుగోలుచేస్తున్నారు.
–స్త్రీ, పురుషులకు పనే....
  చిత్తుకాగితాలు, పాత ఇనుము వంటి వ్యాపారంలో స్త్రీ,పురుషులకు ఉపాధి అవకాశాలున్నాయి. చిత్తు కాగితాలను ఏరడంతో స్త్రీ, పురుషులు కలిసి పనిచేస్తుండగా పురుషులు సైకిల్‌పై తిరిగి వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే షాపుల్లో  వీటిని వేరుచేయడానికి, సీసాలు శుభ్రంచేయడానికి పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తుండగా ఇతర ప్రాంతాలకు పంపించడానికి లారీల్లో ఎగుమతి చేయడానికి జట్టు కార్మికులు పనిచేస్తున్నారు.
–ఎక్కడికి వెళుతున్నాయంటే.....
    చిత్తుకాగితాలు,సీసాలు వంటివి కొనుగోలుచేసే వ్యాపారులు వాటిని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.  సీసాలను రణస్థలం, సంగారెడ్డి వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా   పాత ఇనుము హైదరాబాద్, విజయవాడ, అట్టలను రాజమండ్రి ఎగుమతి చేస్తున్నారు. 
 
–ప్రత్యక్షంగా 50 మందికి ఉపాధి కల్పిస్తున్నా...
ఫొటోఫైల్‌:27బీవీఆర్‌ఎమ్‌37–30080012: గొలగాని సత్యనారాయణ, నవుడూరు....
మాకుటుంబం మొత్తం పాత ఇనుము, చిత్తుకాగితాలు కొనుగోలు చేసే వ్యాపారంలోస్ధిరపడ్డాం, భీమవరం, నవుడూరు, ఆకివీడు ప్రాంతాల్లో షాపులు ఏర్పాటుచేశాం.వీటిల్లో సుమారు 50మంది ప్రతిరోజు పనిచేస్తున్నారు. ఇంకా అనేకమంది పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. మా వ్యాపారానికి పూర్తిస్ధాయిలో లైసెన్సులు కలిగి ఉన్నాం.ముందుగా చిన్నపాటి వ్యాపారం చేసే నేను ఇప్పుడు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది.
 
మరిన్ని వార్తలు