ప్రెషర్ బాంబు పేలి జవాను మృతి

9 May, 2016 20:18 IST|Sakshi

దుమ్ముగూడెం: ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా మారాయిగూడెం అటవీ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలడంతో ఓ సీఆర్‌పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. మారాయిగూడెం నుంచి గొల్లపల్లి మధ్యలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులకు పహారా కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలు అటవీ ప్రాంతంలోకి వెళ్లాయి. ఆ సమయంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలడంతో సీఆర్‌పీఎఫ్ జవాను మడకం జోగా చనిపోగా, పొక్లెయినర్ డ్రైవర్ సంజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
 

మరిన్ని వార్తలు