వేసవిలో సమస్యలు తలెత్తకూడదు

10 Mar, 2017 23:52 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : వేసవిలో తాగునీటి ఇబ్బందులు పశుగ్రాసం కొరత సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లం ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాగునీటి ఎద్దడి , పశుగ్రాసం కొరత నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ అధికారి అనంతరాముని నియమించామన్నారు. జిల్లాలో ఏవైనా సమస్యలుంటే ఆయన దృష్టికి తీసుకురావాలన్నారు.

జిల్లాలో చేపట్టిన చర్యల గురించి ఇన్‌చార్జి జేసీ–2 రఘునాథ్‌ వివరించారు. 137 హ్యాబిటేషన్లలో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు ఎంత గ్రాసం సేకరించాలనేదానిపై అంచనాలు తయారు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జేడీఓ శ్రీరామ్మూర్తి, పశుసంవర్ధక శాఖ జేడీ రవీంద్రనాథ్, సెరికల్చర్‌ జేడీ అరుణకుమారి, సీపీఓ సుదర్శనం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ హరేరాం నాయక్, డీంఎంహెచ్‌ఓ వెంకటరమణ, ఐసీడీఎస్‌ పీడీ జుబేదా బేగం, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు