నీట మునిగిన పంటలు

9 Aug, 2017 23:05 IST|Sakshi
నీట మునిగిన పంటలు

పామిడి:

పామిడిలో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకూ కురిసిన భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. లోతట్టు కాలనీలు, ప్రభుత్వ జూనియర్‌కళాశాల ద్వీపకల్పంగా మారాయి. కేవలం మండలంలోని ఒక నీలూరులోనే 19.62 ఎకరాల పత్తి, వేరుశనగ పంటలు నీట మునిగాయి. అలాగే స్థానిక వైజంక్షన్‌ వద్ద గల ఓ డిగార్డిగేటర్‌లో 12వేల కేజీల వేరుశనగ పప్పు, వేరుశనగకాయల బస్తాలు తడిసిముద్దాయి. నీలూరులో నీట మునిగిన పంటలను, డీ గార్డిగేటర్‌లో తడిసిముద్ద అయిన వేరుశనగ బస్తాలను ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ ఆర్‌.బాలాజీరాజు పరిశీలించారు. నష్టంపై రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.   

మరిన్ని వార్తలు