యథేచ్ఛగా చెట్ల నరికివేత

12 Dec, 2016 15:08 IST|Sakshi
యథేచ్ఛగా చెట్ల నరికివేత

కడెం అడవులకు రక్షణ కరువు
పట్టించుకోని అధికారులు

కడెం :  నిర్మల్ డివిజన్‌లోని కడెం అటవీ క్షేత్రంలో క్రమంగా అడవులకు రక్షణ కరువైంది. స్మగ్లర్లు పెట్రేగిపోతున్నారు. కడెం అటవీ క్షేత్ర కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అడవికి రక్షణ లేదు. అటవీక్షేత్ర కార్యాలయానికి అతి సమీపంలో పెద్దూర్ సెక్షన్‌లో కొద్దిరోజుల క్రితం టేకుచెట్లు యథేచ్ఛగా నరికివేతకు గురయ్యారుు. అటవీ క్షేత్రంలో ఎక్కువ విస్తీర్ణంలో అడవి ఉందంటే అది గంగాపూర్ సెక్షన్‌లోనే. టైగర్‌జోన్ పరిధిలోని ఈ అడవిని కోర్ ఏరియా అంటారు. ఈ అడవిలో పులితో సహా అనేక వన్య ప్రాణులు ఆవాసం ఉంటారుు. అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి సందర్శనకు వస్తుంటారు. అరుుతే, కొద్దిరోజుల క్రితం గంగాపూర్ సమీపంలో కొందరు నాలుగైదు చెట్లు నరికారు. కొద్దిరోజులుగా పెద్దూర్ సెక్షన్‌లోనే చెట్లు నరికివేతకు గురవుతున్నారుు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న చెట్లను స్మగ్లర్లు నిర్భయంగా నరికివేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు.

సిబ్బంది కొరత
రేంజిని కడెం, ఉడుంపూర్‌గా రెండుగా విభజించారు. కడెం రేంజి అధికారికే అదనంగా ఉడుంపూర్ బాధ్యతలు అప్పగించారు. ఇక పాండ్వాపూర్ గ్రామం వద్ద గల అటవీ చెక్‌పోస్టు గతంలో జన్నారం డివిజన్‌లోని అటవీ సిబ్బంది నిర్వహించారు. కానీ, జిల్లాల పునర్విభజన తర్వాత ఆ చెక్‌పోస్టును కడెం రేంజి పరిధిలోకి తెచ్చారు. దీంతో ఈ చెక్‌పోస్టు వద్ద గంగాపూర్ సెక్షన్ సిబ్బందికి అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆ సిబ్బంది అసలు విధులు పక్కకు పోయారుు. ఇటు చెక్ పోస్టు వద్దే ఎక్కువ సమయం గడపాల్సి రావటం, తమ విధులు కాగానే అలసిపోవటంతో డ్యూటీ పక్కకుపోతుంది. ప్రస్తుతం చెక్‌పోస్టు వద్ద గంగాపూర్ సెక్షన్ సిబ్బంది అందరూ షిప్టు ప్రకారంగా డ్యూటీలు చేస్తున్నారు.

ఎక్కువ అటవీ ఉన్న గంగాపూర్ సెక్షన్ పరిధిలో ఉన్న ఈ చెక్‌పోస్టు వద్ద ఎఫ్‌ఎస్వో, ఎఫ్‌బీవోలుకాకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సింది. పెద్దూర్ సెక్షన్‌లో ఈ బీటు పెద్దదే. మద్దిపడగ, చిట్యాల, ధర్మాజీపేట బీట్లు ఉన్నారుు. ఇంకా, మద్దిపడగలో కడెంలో అటవీ నర్సరీలు ఉన్నారుు. వీటన్నింటినీ ఒక్క ఎఫ్‌ఎస్వో, ఎఫ్‌బీఓనే బాధ్యతలు నిర్వహిస్తోంది. దీంతో విధుల నిర్వహణకు అనేక ఇబ్బందులవుతున్నారుు. సంబంధిత ఉన్నతాధికారులు ముందు లోటుపాట్లను సవరించాలి. అడవిపై రక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
 
పకడ్బందీగా వ్యవహరిస్తాం
కడెం క్షేత్ర పరిధిలోని అడవిని రక్షించే విషయంలో దృష్టిసారిస్తాం. విధి నిర్వహణలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తాం. స్మగ్లింగ్‌ను పూర్తిగా నివారిస్తాం. సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం. రాథోడ్ రమేశ్, ఎఫ్‌ఆర్వో, కడెం

మరిన్ని వార్తలు