సైబర్‌ నేరగాడు అరెస్టు

12 Dec, 2016 15:08 IST|Sakshi
సైబర్‌ నేరగాడు అరెస్టు

వేంపల్లె :ఏటీఎం నెంబర్లను సేకరించుకొని సెల్‌ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను దొంగలించే సైబర్‌ నేరగాడు షేక్‌ శ్రీనివాసులును వేంపల్లె పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టుకు పంపారు. వివరాలలోకి వెళితే.. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన షేక్‌ శ్రీనివాసులు ఆర్మీలో పనిచేస్తూ వ్యసనాలకు బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. విజయవాడలో గుర్రపు పందేలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత ఏటీఎం ద్వారా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఆంధ్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో క్యూలో నిలబడి వారి ఏటీఎం కార్డును సేకరించుకొని సెల్‌ఫోన్‌ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను కాజేస్తూ వచ్చాడు. రాజేష్, ప్రహ్లాద, హరీష్‌ వేంపల్లెకు చెందిన సైఫుల్లా అనే స్నేహితుల ఏటీఎం నెంబర్ల ద్వారా డబ్బులు కాజేశాడు. ఈనెల 11వ తేదీన వేంపల్లె ఆర్‌ఎంఎస్‌ వీధికి చెందిన సైఫుల్లా పిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం కడప రోడ్డులోని అగ్రికల్చర్‌ చెక్‌పోస్టు వద్ద  షేక్‌ శ్రీనివాసులును అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు ఏటీఎం కార్డులను, రూ.1000  నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ మధుమల్లేశ్వరరెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు