3న సైకిల్‌పోలో జిల్లా జట్ల ఎంపికలు

30 Aug, 2016 20:47 IST|Sakshi
3న సైకిల్‌పోలో జిల్లా జట్ల ఎంపికలు
వీరపనేనిగూడెం (గన్నవరం రూరల్‌) :
 సైకిల్‌ పోలో కృష్ణాజిల్లా సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 3వ తేదీన ఉదయం.10గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సబ్‌ జూనియర్, జూనియర్, సీనియర్‌ బాలుర జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనియాల నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు వయస్సు «ధ్రువీకరణ పత్రం, క్రీడాదుస్తులు, షూస్‌తో క్రీడా మైదానంలో హాజరు కావాలని చెప్పారు. ఎంపికైన జట్లు సెప్టెంబర్‌ 11, 12వ తేదీలలో కర్నూలు జిల్లా బనగానపల్లెలో జరిగే ఏపీ అంతర్‌ జిల్లాల సైకిల్‌ పోలో ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు పంపటం జరుగుతుందని చెప్పారు. 
 
>
మరిన్ని వార్తలు