గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం

17 Aug, 2016 22:52 IST|Sakshi
గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధం
ఆలమూరు (పెనుమంట్ర): ఆలమూరు శివారు కోమటిచెరువులో బుధవారం గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఒక ఇల్లు దగ్ధమైంది.  గ్రామ శివారు కోమటి చెరువు ప్రాంతంలో ఉదయం 10 గంటలకు కొండేటి సూర్యారావు ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్‌ లీకై ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించి సిలిండర్‌ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.  రూ. 1.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు  అత్తిలి  అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. గ్రామ కార్యదర్శి, వీఆర్వోలు ప్రమాద నష్ట వివరాలను నమోదు చేశారు.
 
 
 
 
>
మరిన్ని వార్తలు