అన్నమయ్య కీర్తనల్లో తెలుగుదనం గుబాళింపు

10 Sep, 2016 21:52 IST|Sakshi
అన్నమయ్య కీర్తనల్లో తెలుగుదనం గుబాళింపు
 
విజయవాడ కల్చరల్‌: పద కవితకు ఆద్యుడు అన్నమయ్య అని జిల్లా సెషన్‌ జడ్జి శ్రీకాంతాచారి అన్నారు. శివరామకృష్ణ క్షేత్రంలో శ్రీఅన్నమయ్య సంకీర్తన కచేరి, జ్యోతిష్య శాస్త్రవేత్త అచ్చిరెడ్డి రచించిన దైవదర్శనం గ్రం«థావిష్కరణ  కార్యక్రమాలు జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాంతాచారి మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో అన్నమయ్యకు విశిష్టమైన స్థానం ఉందని, ఆయన సంకీర్తనలలో తెలుగు పదాల గుబాళింపు ఉంటుందని వివరించారు. యువ జ్యోతిష్య శాస్తవేత్త  కె.లక్ష్మీప్రియ మాట్లాడుతూ జ్యోతిష్యంకూడా ఒక శాస్త్రమేనని ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన అన్నమయ్య సంకీర్తనల ప్రచారకుడు గాయకుడు దిలీప్‌కుమార్‌ బృందం రసరమ్యంగా అన్నమయ్య సంకీర్తనలను గానం చేసింది. చివరగా ఘంటసాల భక్తి సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. 
 
 
 
మరిన్ని వార్తలు