దళితులకు రక్షణ కరువు

4 Jul, 2017 02:47 IST|Sakshi
దళితులకు రక్షణ కరువు

►‘గరగపర్రు’ దోషులను శిక్షించాలి
► గాంధీ విగ్రహం వద్ద  కొవ్వొత్తుల ప్రదర్శన
► ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు


ద్వారకానగర్‌ (విశాఖ దక్షిణ) : దళితులకు దేశంలో రక్షణ కరువైందని, వారిపై విచక్షణా రహితంగా దాడులు పెరిగిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దళిత, ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేవీ మాట్లాడుతూ గోరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా హత్యాదాడులు పెరిగాయన్నారు.

యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ అధికారంలోకి వచ్చాక మహిళలపై 30 శాతం దాడులు పెరిగాయన్నారు. ఏపీలో కూడా ఆదే సంస్క్రతి ఉందని ఆరోపించారు. అగిరిపల్లి, గరగపర్రు వంటి గ్రామాల్లో దళితులపై సాంఘిక బహిష్కరణ జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దళితలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, దేవుడిని పూజించే హక్కుతో పాటు స్వేచ్ఛగా తినే హక్కును కూడా ప్రభుత్వాలు మంటగలుపుతున్నాయన్నారు.

గరగపర్రు దాడులను చూస్తూ ప్రభుత్వం ఖండిచకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆచార్య సూరప్పుడు, సామాజిక హక్కుల వేదిక నాయకుడు బొడ్డు కల్యాణరావు, మాజీ వీసీ రమణ, సీపీఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎం.పైడిరాజు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగ నగర కన్వీనర్‌ పసుపులేటి ఉషాకిరణ్, బొట్టా స్వర్ణ, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు ఎం.ఎ. బేగం, దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జేడీ నాయుడు, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి. చంద్రశేఖర్, సీపీఐ నాయకులు పైల ఈశ్వరరావు, జి,వామనమూర్తి, రాజుబాబు, సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు.  

‘గరగపర్రు’పై ఏయూ బంద్‌
నినదించిన పరిశోధకులు, విద్యార్థులు
ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు) : రాష్ట్రంలో దళితులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏయూ పరి శోధకులు, విద్యార్థులు నినదించారు. ప.గో జిల్లాలోని గరగపర్రు సంఘటనకు నిరసనగా సోమవారం విశ్వవిద్యాలయంలో బంద్‌ నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన ‘చలో గరగపర్రు’ కార్యక్రమం నిర్వహిచేందుకు నిర్ణ యం తీసుకున్నారు. తొలుత ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్‌ విద్యార్థులు, గ్రంథాలయాల సిబ్బందిని పం పించేసి బంద్‌ నిర్వహించారు.

చివరన పరీక్షలు, పరిపాలనా విభాగాల సిబ్బందిని పంపించేసి బంద్‌ నిర్వహించారు. సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు దళితులకు తగిన న్యాయం చేయాలన్నారు.  జేఏసీ సభ్యులు బోరుగడ్డ మోహన బాబు, ఆరేటి మహేష్, టి.వి రాఘవులు, రంగనాథ్‌రాయ్‌ వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బి.కాంతారావు, తుళ్లి చంద్రశేఖర యాదవ్, సునీల్‌కుమార్, ఆనంద రత్నకుమార్, రామక్రిష్ణ, వరుణ్‌ చైతన్య, కె.రవికుమార్, శిరీష్, రమణ, శ్యామ్‌ సుందర్, టి. సురేష్‌ కుమార్, ప్రియాంక, రొయ్యి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 

మరిన్ని వార్తలు