దళితులను మోసగిస్తున్న చంద్రబాబు

11 Jan, 2017 22:40 IST|Sakshi
దళితులను మోసగిస్తున్న చంద్రబాబు
 
  • సవాలును స్వీకరించకుండా ఒప్పేసుకున్న మంత్రి రావెల 
  • – డాక్టర్‌ మేరుగ నాగార్జున
 
 
తెనాలి : చంద్రబాబు ప్రభుత్వం దళితులను మోసం చేస్తోందని, వారి సంక్షేమాన్ని దళారులపరం చేస్తూ, దళిత చట్టాలు అపహాస్యం పాలవుతున్నాయని, వాస్తవాలపై చర్చకు సిద్ధమంటూ తాను చేసిన సవాలుకు మంత్రి రావెల కిషోర్‌బాబు పక్కకు తప్పుకొని, దళితులను ప్రభుత్వం మోసగిస్తున్నట్టు అంగీకరించినందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మేరుగ నాగార్జున అభినందించారు. కేవలం ప్రత్తిపాడు నియోజకవర్గంపైన చర్చకు మంత్రి అంగీకరించినందున దమ్మూ ధైర్యం ఉంటే ఆ అంశంపైనా చర్చకు తేదీ సమయం వెల్లడించాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడి అడ్డు ఎలా తొలగించుకోవాలో తెలుసునంటూ తనను తాను చంద్రబాబు అమ్ములపొదిలో రామబాణమని రావెల చెప్పుకున్నారని గుర్తుచేస్తూ, అవినీతి పొదిలో పుల్లవనీ, కించపరచేలా మాట్లాడొద్దని హెచ్చరించారు. సత్తా వుంటే దళితులకు రావాల్సిన వాటా విషయంలో చంద్రబాబును నిలదీయాలన్నారు. తెనాలిలో బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో డాక్టర్‌ నాగార్జున మాట్లాడారు. 'వైఎస్సార్‌సీపీ నాయకులు పిరికిపందలనీ, వాళ్లతో మేం ఏదైనా చర్చించటానికి సిద్ధంగా ఉన్నా పారిపోతున్నారంటూ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు విసిరిన సవాల్‌ను తాను స్వీకరించినట్టు నాగార్జున గుర్తుచేశారు. దళితులకు జరుగుతున్న అన్యాయాలు, ఉపప్రణాళిక నిధుల పక్కదారి, మైనారిటీ మహిళ చేయిపట్టుకున్న కుమారుడి వ్యవహారం, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ జానీమున్‌ను చంపుతామని బెదిరించిన వైనంపైనా చర్చకు సంసిద్ధతను వ్యక్తంచేశానన్నారు.  ప్రత్తిపాడు నియోజకవర్గంలోనూ అనేక అవకతవకలున్నట్టు ఆధారాలున్నాయని చెబుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే సుచరిత, అంతకుముందు ఎమ్మెల్యేగా రావి వెంకటరమణ ఎంతో అభివృద్ధిని చేశారన్నారు. వీరితో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందోలు డేవిడ్‌విజయ్‌కుమార్, ఎస్సీ విభాగ రాష్ట్ర కార్యదర్శి పెరికల కాంతారావు, తదితరులున్నారు.
 
 
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా