దళితులను కించపరిస్తే ఇక దాడులే..

27 Aug, 2016 21:46 IST|Sakshi
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి

హిమాయత్‌నగర్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారణాలను ప్రస్తావించకుండా బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకే రూపన్‌వాల్‌ కమిటీ దళితులకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ అన్నారు. దళితులను కించపరిచేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వారిపై దాడులకు సిద్దపడతామని హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు, ఎమ్మెల్సీ రాంచంద్రరావు, ఏబీవీపీ నాయకులు సుశీల్‌కుమార్‌లను తక్షణం అరెస్ట్‌ చేయాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బోనులో ఎక్కే ప్రమాదం ఉన్నందునే కమితో తప్పుడు నివేదిక ఇప్పించారని ఆరోపించారు. జాతీయ కమిషన్, జిల్లా కలెక్టర్లు నిర్థారించిన తరువాత కూడా రోహిత్‌ కుల ప్రస్తావన తేవడం విడ్డూరంగా ఉందన్నారు. దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా నివేదిక ఇచ్చిన రూపన్‌వాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. రూపన్‌వాల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 29న ఇందిరాపార్క్‌ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.
 

మరిన్ని వార్తలు