నర్తకి భాగ్యలక్ష్మికి జాతీయ బహుమతి

14 Nov, 2016 22:17 IST|Sakshi
కాకినాడ కల్చరల్‌ : 
కూచిపూడి నృత్యకళాకారిణి సిహెచ్‌.భాగ్యలక్ష్మి జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి సాధించించారు. రాజస్థా¯ŒS రాష్ట్రం జైపూర్‌లోని మహావీర్‌ ఆడిటోరియంలో ఈ నెల 8 నుంచి 11 వరకూ నిర్వహించిన తపాల శాఖ జాతీయ సాంస్కృతిక పోటీల్లో కాకినాడకు చెందిన భాగ్యలక్ష్మి కూచిపూడి నృత్య విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరచి ప్రథమ బహుమతి పొందారు. ఈమెకు పోస్టు మాస్టర్‌ జనరల్‌ బి.బి.దేవ్‌ బహుమతి అందజేసి సత్కరించారు. గత నెల 27, 28 తేదీల్లో కాకినాడ సూర్యకళామందిర్‌లో తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్టల్‌ సర్కిల్స్‌ సిబ్బంది, వారి పిల్లలు పాల్గొన్నారు. అందులో భాగ్యలక్ష్మి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రథమ బహుమతి దక్కించుకొని, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఆ పోటీల్లో కూడా ప్రథమ స్థానం లభించడం పట్ల ఆమెను పలువురు అభినందించారు. ఈమె తండ్రి సిహెచ్‌.జానకిరామ్‌ కాకినాడ ప్రధాన పోస్టల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. కూచిపూడి నాట్యాలయం వ్యవస్థాపకులు కె.కృష్ణకుమార్‌ వద్ద పదేళ్లుగా భాగ్యలక్ష్మి శిక్షణ పొందుతున్నారు.  
 
 
మరిన్ని వార్తలు