వాతావరణ మార్పుతో అరటికి తెగుళ్ల ముప్పు

16 Sep, 2017 21:32 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: మారిన వాతావరణ పరిస్థితులతో అరటికి తెగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని రేకులకుంట ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.శ్రీనివాసులు, శాస్త్రవేత్త డాక్టర్‌ దీప్తి తెలిపారు. శనివారం స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ప్రిన్సిపల్‌ ఎస్‌.చంద్రశేఖరగుప్తా ఆధ్వర్యంలో అరటి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు అరటి సాగులో మేలురకం మొక్కలు, నాటడం, నీటి నిర్వహణ, ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ప్రధానంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అరటికి సిగటోకమచ్చ తెగులు, కుళ్లు తెగులు, పండుఈగ, తామర పురుగులు లాంటి తెగుళ్లు, చీడపీడలు సోకే అవకాశం ఉన్నందున వాటి లక్షణాలు కనిపించిన వెంటనే పురుగు మందులు పిచికారీ చేసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు