ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు

18 Aug, 2016 22:17 IST|Sakshi
ప్రమాదకరంగా విద్యుత్‌ తీగలు
  • ఇళ్లపై నుంచి యమపాశాలు
  • వర్షం వస్తే షాక్‌ తినాల్సిందే
  • భయం గుప్పిట్లో హౌసింగ్‌బోర్డు ప్రజలు
  • పలుమార్లు ఫిర్యాదు  చేసిన
  •  పట్టించుకోని అధికారులు
  • అభివృద్ధికి అడ్డు తగులుతున్న అధికారులు
  • మెదక్‌:పట్టణంలోని ప్రజలు విద్యుత్‌ తీగలతో బెంబేలు చెందుతున్నారు. ప్రమాదకరమైన విద్యుత్‌వైర్లు పదుల సంఖ్యలో ఇళ్లపై నుంచి వెళుతున్నాయి.అవి తరుచూ ప్రజలను కరెంట్‌ షాక్‌లకు  గురిచేస్తున్నాయి. పట్టించుకోవలసిన విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్షంగా ప్రవర్తిస్తు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లు చూస్తున్నారు తప్పితే ఎలాంటి పరిష్కారం చూపడం లేదని స్థానికులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    వివరాల్లోకి వెళ్తే... మెదక్‌ పట్టణంలోని 1వ వార్డులో హౌసింగ్‌బోర్డు, ఆర్టీసి కాలనీ , ఎంఐజి, ఎల్‌ఐజి కాలనీలున్నాయి. ఈ  కాలనీల్లో పదుల సంఖ్యలో ఇళ్లపై నుంచి ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు వెళుతున్నా వాటిని సరి చేయకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.వర్షం వస్తే  వర్షానికి విద్యుత్‌ వైర్లు తడిసి షాక్‌ కొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ఇటాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టిన్నట్లు కూడా లేదని అదికారుల వల్లే తమ కాలనీ పరిస్థితి ఘోరంగా తయారైందని కాలనీ వాసులు వాపోయారు. 

    నిరసన వ్యక్తం చేస్తే తమ కాలనీకి  పోలీసులను పంపించి వారిస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా ప్రజాప్రతినిధులు వారిని వారించాల్సింది పోయి  వారికి సపోర్టుగా నిలవడం ఎంత వరకు సమంజసమన్నారు.ప్రజా ప్రతినిధులు కరక్ట్‌గా ఉంటే తమ కాలనీకి ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కావన్నారు. ఒకపక్కన సర్కారు అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చెపడుతుంటే తమ కాలనీ అభివృద్ధికి నోచుకోకుండా అధికారులు అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు.

    ఇప్పటికే  వీటి బారీన  ఎంతో మంది పడ్డారన్నారు. అంతేకాకుండా ఈ కాలనీలో పలు చోట్ల విద్యుత్‌ తీగలు వేలాడుతుండటంతో గాలి దూమారం వస్తే ఒకటి కొకటి తగిలి ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్టాన్రిక్‌ వస్తువులన్నీ కాలిబూడిదవుతున్నాయి.గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని  ఆర్టీసీ కాలనీ వారు  వాపోయారు. ఈ కాలనికి చెందిన రవి అనే వ్యక్తి ఇంటిపై   ఇంటిపై నుంచి విద్యుత్‌ తీగలు వెళ్లాడంతో విద్యుత్‌ షాకుకు గురయ్యాడు. 

    పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం వాటిని సరిచేయడం లేదని  కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే కాలనీలోని తన ఇంటిపై నుంచి కరెంట్‌ తీగలుండటంతో వర్షం పడిన ప్రతిసారి కరెంట్‌షాక్‌ వస్తుందని హౌసింగ్‌బోర్డులోని సత్యవతి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైన అధికారులు స్పందించి తక్షణ పరిష్కారం చూపాలని పలువురు  స్థానికులు కోరుతున్నారు.
    ఆందోళన చేస్తే అరెస్ట్‌లా?
    గతంలో గాలి దూమారం వచ్చిన సందర్భంగా హౌసింగ్‌బోర్డులో వేలాడుతున్న విద్యుత్‌ తెగిపోవడంతో పాటు స్తంభాలు విరిగిపోయి, ఇళ్లలోని ఎలక్టాన్రిక్‌ వస్తువులన్నీ కాలిపోయాయని ప్రస్తుత వార్డు కౌన్సిలర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. కాగా వాటిని సరిచేసే క్రమంలో అధికారులు తీవ్ర జాప్యం చేశారు. దీనిపై కాలనీలోని కొంతమంది ఆందోళనకు దిగితే 7గురిని అరెస్ట్‌చేసి జైలుకు పంపించారు. నాటి నుంచి నేటి వరకు హౌసింగ్‌బోర్డు కాలనీలో కరెంట్‌ వ్యవస్థ అస్తవ్యస్తగానే ఉంది.

    ఈ కాలనీలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లకు కనీసం కంచె కూడా వేయలేదు. రెండుచోట్ల పార్కుల పక్కనే కంచె లేని ట్రాన్స్‌పార్మర్లు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైన అధికారులు స్పందించి కాలనీలోని ఇళ్లపై ఉన్న తీగలతోపాటు వేలాడుతున్న వాటిని సరిచేసి, ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టు కంచె వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయనతోపాటు కాలనీకి చెందిన పలు కమిటీల నాయకులు కిష్టయ్య, రాజయ్య, పెంటయ్య, శ్రీధర్,రమేష్‌లు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు