చీకటి గదులు.. దుర్వాసన

18 Mar, 2017 23:27 IST|Sakshi
చీకటి గదులు.. దుర్వాసన
పెనుగొండ : పదో తరగతి పరీక్షలకు పెనుగొండ జెడ్‌ఎన్‌వీఆర్‌ హైసూ్కల్‌లో కనీస సదుపాయాలు కల్పించడంలో విద్యాశాఖా«ధికారులు విఫలమయ్యారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కాగా తొలిరోజు విద్యార్థులు అవస్థలు పడ్డారంటూ శనివారం హై స్కూల్‌ వద్దకు తల్లిదండ్రులు భారీస్థాయిలో తరలివచ్చారు. తరగతి గదుల్లో కనీస వెలుతురు లేదని, దుర్వాసనతో పరీక్షలు రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఉక్కపోతతో విద్యార్థులు అవస్థలు పడ్డారన్నారు. దీనిపై స్థానిక విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని విలేకరుల వద్ద మొరపెట్టుకున్నారు. బెంచీలు, పారిశుద్ధ్యం నిర్వహణ ఘోరంగా ఉందన్నారు. 
 
సౌకర్యాలు కల్పిస్తాం: డీఈవో
జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్‌ గంగాభవాని పెనుగొండలో టెన్‌త పరీక్ష కేంద్రాలైన జెడ్‌ఎన్‌వీఆర్‌ హైసూ్కల్, చైతన్య ఇంగ్లిష్‌ వీుడియం స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెడ్‌ఎన్‌వీఆర్‌ హైసూ్కల్‌ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో ఆమె వివరణ ఇచ్చారు. పాఠశాలలో సౌకర్యాల కల్పనపై శ్రద్ధ తీసుకో వాలంటూ ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి బెంచీలు తెప్పించాలని, తరగతి గదుల్లో ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. దుర్వాసన వెదజల్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్క డా మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని డీఈ వో గంగాభవాని తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.  
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా