6 జిల్లాల్లో డయాలసిస్‌ సెంటర్లు, పాఠశాలలు

27 Aug, 2016 00:24 IST|Sakshi
పాలకొల్లు అర్బన్‌ : రోటరీ ఇంటర్నేషనల్‌ ప్రోత్సాహంతో ఈ ఏడాది ఆరు జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా డయాలసిస్‌ సెంటర్లు, రోటరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రోటరీక్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ డాక్టర్‌ ఎస్‌వీఎస్‌ రావు అన్నారు. గవర్నర్‌ అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన పాలకొల్లు మండలంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నాగరాజుపేటలోని గురుకుల విద్యార్థులు ఎండ్‌ పోలియో ఆకృతిలో కూర్చుని పోలియోని శాశ్వతంగా నిర్మూలిద్దాం అంటూ నినాదం ఇచ్చారు. అంజలి మానసిక వికలాంగుల స్కూల్‌లో మదర్‌థెరిస్సా 150వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. క్లబ్‌ అధ్యక్షుడు బాలి ఏడుకొండలు విరాళం రూ.5 లక్షలతో నిర్మించిన భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. అంజలి స్కూల్‌ విద్యుదీకరణ నిమిత్తం రూ.40 వేలు విరాళాన్ని ప్రకటించారు. ఓఎన్‌జీసీ జనరల్‌ మేనేజర్‌ ఏవీవీఎస్‌ కామరాజు స్కూల్‌కి 12సీలింగ్‌ ఫ్యాన్‌లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాలయలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ రోటరీ డయాలసిస్‌ సెంటర్, రోటరీ స్కూల్‌ ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, దాతల సహకారంతో సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్‌ అధ్యక్షుడు కొప్పు సత్యనారాయణణ,  క్ల»Œ æకార్యదర్శి అనంతపల్లి కిరణ్‌కుమార్, రావూరి వెంకట అప్పారావు, చందక రాము, గొర్ల శ్రీనివాస్, సోమంచి శ్రీనివాసశాస్త్రి, గుడాల హరిబాబు, యాతం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు