దళితులకు రాజ్యాంగ ప్రయోజనాలు దక్కాలి

20 Oct, 2016 21:09 IST|Sakshi
దళితులకు రాజ్యాంగ ప్రయోజనాలు దక్కాలి

 మచిలీపట్నం (చిలకలపూడి): దళిత, గిరిజనుల సంక్షేమానికి అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగ ప్రయోజనాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని దళిత బహుజన పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు నాగేశ్వరరావు అన్నారు. స్థానిక అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహిస్తున్న మహాసభలు గురువారంతో ముగిశాయి. నాగేశ్వరరావు మాట్లాడుతూ దళిత గిరిజనులు ఐక్యంగా ఉండి అంబేడ్కర్‌ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల సాధనకు కృషి చేయాలన్నారు. దళితులు ఉన్నత పదవిలో ఉన్నారంటే దానికి కారణంగా అంబేడ్కరేనన్నారు. దళిత గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను అవగాహన చేసుకుని అమలు జరిగేలా కృషి చేయాలన్నారు.
అట్రాసిటీ కేసుల్లో స్టేషన్‌ బెయిలు వద్దు
 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో స్టేషన్‌ బెయిల్‌ను పూర్తిగా రద్దు చేయాలని, కింది కోర్టుల్లో కూడా బెయిల్‌ మంజూరు చేయరాదనే నిబంధనలు న్యాయస్థానాలు చిత్తశుద్ధితో అమలు జరపాలని ఆయన కోరారు. అనంతరం దళిత బహుజన పరిరక్షణ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొడాలి దయాకర్, కార్యదర్శిగా పీతల  శ్యామ్‌కుమార్, కోశాధికారిగా విడియాల చినరామయ్యతో పాటు మరో 49 మంది కార్యవర్గ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా