ఎరువుల అమ్మకంలో ‘డీబీటీ’ తప్పనిసరి

8 Sep, 2017 22:27 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో ఎరువుల అమ్మకాలు తప్పనిసరి చేయాలని స్టేట్‌ కన్సల్టెంట్‌ సంతోష్‌కుమార్‌ తెలిపారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు ఇందులో ఎలాంటి అలసత్వానికి తావులేదన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ చాంబర్‌లో మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ ఎ.బాలభాస్కర్, డీసీఎంఎస్‌ జిల్లా మేనేజర్‌ విజయభాస్కర్, టెక్నికల్‌ ఏవో చెన్నవీరస్వామి తదితరులతో సమావేశం నిర్వహించారు.

అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలుగా లైసెన్సు కలిగిన ఎరువుల అంగళ్లకు బయోమెట్రిక్, స్వైప్‌ మిషన్లు అందజేయాలన్నారు. అయితే అక్కడక్కడ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నందున ఆధార్‌బేస్డ్‌ బయోమెట్రిక్‌ పద్ధతికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడంతో పాటు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకుంటే సమస్యలు తగ్గుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు