నేటి నుంచి డీసెట్‌–2016 సర్టిఫికెట్ల పరిశీలన

7 Aug, 2016 00:24 IST|Sakshi
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : డీసెట్‌–2016(డైట్‌సెట్‌)లో భాగంగా ఆదివారం నుంచి పదో తేదీ వరకు బి.తాండ్రపాడులోని ప్రభుత్వ డైట్‌ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుందని డైట్‌ ప్రిన్సిపాల్‌ రాఘవరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమ వెంటనే ఆన్‌లైన్‌ అప్లికేషన్, హాల్‌ టిక్కెట్, ర్యాంకు కార్డు, పదో తరగతి మార్కుల లిస్టు, ఇంటర్‌ మార్కుల లిస్టు, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు(ఒకటి నుంచి 10వ తరగతి), కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేదా రేషన్‌ కార్డులతో పాటు  పీహెచ్, స్పోర్ట్స్, క్యాప్, ఎన్‌సీసీ(బీ ఆర్‌ సీ) తదితర సర్టిఫికెట్లను తీసుకొని 45్ఠ30 సైజు పాలిథిన్‌ కవర్‌లో పెట్టుకొని రావాలని సూచించారు. అంతేకాక జిల్లాలోని అన్ని ప్రై వేట్‌ డీఈడీ కళాశాలల  ప్రిన్సిపాళ్లు కూడా హాజరు కావాలని కోరారు. 
 
మరిన్ని వార్తలు