‘మిగులు’కు మరో ఛాన్స్ '

13 Jul, 2016 02:05 IST|Sakshi
‘మిగులు’కు మరో ఛాన్స్ '

దరఖాస్తుల నమోదు గడువు పొడిగింపు
ప్రభుత్వానికి లేఖ రాసిన యంత్రాంగం
ఆక్రమణదారులు ముందుకు రాకపోవడమే కారణం

జిల్లాలోని 601 ఎకరాల మిగులు భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది.

మీ సేవ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 4,627 అర్జీలే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్‌సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులొచ్చారుు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పట్టణ భూ గరిష్ట పరిమితి (యూఎల్‌సీ) భూముల క్రమబద్ధీకరణ గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మిగులు భూముల క్రమబద్ధీకరణకు ఇదే చివరి ఛాన్ ్స అని హెచ్చరించినా ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఆక్రమణదారులకు మరోసారి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరుతూ జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. జీఓ 92 కింద యూఎల్‌సీ స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ర్ట సర్కారు వెసులుబాటు కల్పించింది. మిగులు భూములుగా గుర్తించిన స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించింది.

దీంట్లో భాగంగా జిల్లాలోని 601 ఎకరాల మిగులు   భూముల్లో ఖాళీస్థలాలను గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం.. వీటిని 5,700 మంది ఆధీనంలో ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు గత నెల 25వ తేదీవరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఒకవేళ క్రమబద్ధీకరణకు ముందుకు రాకపోతే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. అరుునప్పటికీ మీ-సేవ కేంద్రాల ద్వారా 4,627 అర్జీలు మాత్రమే అందారుు. శివార్లలోని 12 పట్టణ మండలాల్లో క్షేత్రస్థారుులో యూఎల్‌సీ స్థలాలు పరిశీలించి మరీ సమాచారం అందించినా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు నమోదు కావడంతో రెవెన్యూయంత్రాంగం ఆశ్చర్యపోరుుంది. అరుుతే గుర్తించిన భూములను క్రమబద్ధీకరించుకోవాలని సూచిస్తూ వీరందరికి నోటీసులు జారీ చేసినా.. నిర్ణీత వ్యవధిలో వారికి అందలేదని అధికారుల పరిశీలనలో బయటపడింది.

అర్జీల సమర్పణ గడువు ముగిసిన తర్వాత చాలా మందికి నోటీసులు అందినట్లు తేలింది. ఇది దరఖాస్తుల సంఖ్య తగ్గడానికి కారణమైనట్లు స్పష్టమైంది. దీనికితోడు.. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుల అప్‌లోడ్‌లో జాప్యం, ఆక్రమణదారుల్లో చాలా మంది స్థానికంగా నివసించకపోవడం.. పొజిషన్ లో ఉన్నవారికి తమ స్థలాలు యూఎల్‌సీ పరిధిలో ఉన్నాయని తెలియకపోవడం కూడా దరఖాస్తులపై ప్రభావం చూపిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును పెంచే అంశాన్ని పరిశీలించాలంటూ యూఎల్‌సీ ప్రత్యేకాధికారి ప్రభుత్వాన్ని కోరారు. కనీసం మూడు వారాలపాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఇవ్వాలని లేఖ రాశారు.

మరిన్ని వార్తలు