చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లు పరిష్కరించండి

20 Sep, 2016 23:49 IST|Sakshi
అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు
దూసి(ఆమదాలవలస రూరల్‌): కార్మికుల చార్టర్‌ ఆఫ్‌ డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. దూసి గ్రామంలో కాన్‌కాస్ట్‌ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా మంగళవారం ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అండతో కాన్‌కాస్ట్‌ యాజమాన్యం కార్మిక హక్కులపై దాడి చేస్తుందని విమర్శించారు. కార్మిక చట్టాలను తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని, డీఏ పాయింట్‌కు రూ. 12 ఇవ్వాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఎడ్యుకేషన్‌ అలవెన్స్, యూనిఫాం వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రిలే నిరాహార దీక్షలో కార్మికులు బమ్మిడి రమణ, రామచంద్రరాజు, మోహన్‌రావు, బి.కాళిదాస్, టి.రాము, పి.రాజశేఖర్, సి.హెచ్‌.జానకిరావు, వి.రాజు, వై.వాసుదేవరావు, బి.తేజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు