మృత్యుపాశం

10 Nov, 2016 01:50 IST|Sakshi
మృత్యుపాశం
మృత్యువు పాశం విసిరింది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురిని బలి  తీసుకుంది. చించినాడ బ్రిడ్జిపై నుంచి ట్రక్‌ కిందపడి ఇద్దరు, విద్యుదాఘాతానికి ఒకరు, రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు.  
 
డ్రైవర్, క్లీనర్‌ మృతి 
యలమంచిలి : చించినాడ బ్రిడ్జిపై నుంచి బుధవారం తెల్లవారుజామున ట్రక్‌ బోల్తాపడి ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.  ఎస్‌ఐ పాలవలస అప్పారావు కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి రొయ్యల లోడుతో బయలుదేరిన ట్రక్‌ కాకినాడ వెళ్లి అక్కడ రొయ్యలు దించిన అనంతరం మంగళవారం అర్ధరాత్రి ఒంగోలు తిరుగు ప్రయాణమైంది. చించినాడ వంతెనపైకి వచ్చాక డ్రైవర్‌కు నిద్రమత్తు ఆవహించి కనురెప్ప వేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఎడమవైపున వెళుతున్న వాహనం ఒక్కసారిగా కుడివైపునకు తిరిగి వంతెన డివైడర్‌ను ఢీకొట్టి కింద ఉన్న రొయ్యల చెరువులో పడిన్నట్టు అనుమాని స్తున్నారు. ప్రమాదంలో ఒంగోలుకు చెందిన ట్రక్‌ డ్రైవర్‌ పి.సందాని (25) అక్కడికక్కడే మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకునే సరికి గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన క్లీనర్‌ ఎల్లగొండ పాములు కొన ఊపిరితో ఉన్నాడు. అతడిని 104లో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 
 
ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొని పాస్టర్‌.. 
కాళ్ల : ఏలూరుపాడు గ్రామంలో ఆయిల్‌ ట్యాంక్‌ ఢీకొని ఓ పాస్టర్‌ మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. కాళ్ల పోలీసుల కథనం ప్రకారం ఏలూరుపాడులోని రాష్ట్ర రహదారిపై సాయిబాబా గుడి సమీపంలో భీమవరం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో గ్రామంలోని సెవె¯ŒS్తడే సంస్థలో పాస్టర్‌గా పనిచేస్తున్న గొల్లమందల రాజబాబు(40) మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.  ప్రమాదంపై కాళ్ల ఏఎస్‌ఐ ఎ¯ŒS.హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
విద్యుదాఘాతంతో యువకుడు.. 
జంగారెడ్డిగూడెం రూరల్‌ : మండలంలోని నిమ్మలగూడెంలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. నిమ్మలగూడెంలోని ఒక రైతుల పొలంలో వరి కోత కోసే పని నిమిత్తం లారీపై యంత్రాన్ని తీసుకొచ్చారు. ఈ యంత్రాన్ని తీసుకొస్తున్న క్రమంలో విద్యుత్‌ తీగలను తప్పిస్తున్న యువకుడు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించాడు. ఆ యువకుడు తమిళనాడుకు చెందినవాడని తెలుస్తోంది. యంత్రంతోపాటు వచ్చాడని రైతులు చెబుతున్నారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన కొద్దినిమిషాల్లోనే మృతదేహాన్ని తరలించేయడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు.   
 
టిప్పర్‌ ఢీకొని మోటార్‌ సైక్లిస్టు మృతి  
ఏలూరు అర్బ¯ŒS  : టిప్పర్‌ ఢీకొని ఓ మోటార్‌ సైక్లిస్టు బుధవారం మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. తంగెళ్లమూడి శివగోపాలపురానికి చెందిన యనమనీడి జీసస్‌ స్థానిక జ్యూట్‌మిల్లులో పనిచేస్తున్నాడు. బుధవారం  అతను కుటుంబపనులపై హనుమా¯ŒSనగర్‌ వెళ్లేందుకు మోపెడ్‌పై బయలుదేరాడు. సీఆర్‌ఆర్‌ కాలేజీ సమీపంలో వెనుకగా వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఫలితంగా జీసస్‌ రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు.  త్రీ టౌ¯ŒS పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీ ఉన్నాడు.   
 
మరిన్ని వార్తలు