నైపుణ్య వృద్ధితోనే ఉద్యోగావకాశాలు

23 Aug, 2016 01:04 IST|Sakshi
 
నెల్లూరు(టౌన్‌): మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించినప్పుడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈఓ గంటా సుబ్బారావు తెలిపారు. సోమవారం విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలోని సెమినార్‌ హాల్లో పీజీ, డిగ్రీ విద్యార్థులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో సరాసరి ఏడాదికి 3 లక్షల మంది పట్టభద్రులు వస్తున్నారని, వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదన్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో మార్కులపై దృష్టి పెట్టి నైపుణ్యాలను తక్కువ స్థాయిలో పెంపొందించడం కారణంగా చెప్పారు. నైపుణ్యాలను పెంపు దిశగా ఆంధ్రప్రదేశ్‌ సంస్కరణలు అన్ని స్థాయిల్లో చేపట్టిందన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ అన్ని స్థాయిల్లో అన్ని వర్గాలకు కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి పరుస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రగతి, నిరుద్యోగ యువత ఉపాధి కల్పనలో పాటు బడుతుందని తెలిపారు. సమావేశంలో వీఎస్‌యూ వైస్‌.ఛాన్సలర్‌ వీరయ్య, రిజిస్ట్రార్‌ శివశంకర్, డీన్‌ చంద్రయ్య, ప్రదీప్, సురేష్, శ్యామ్‌మోహన్, లోకనాధం, భాగ్యశ్రీ, సతీష్, శివప్రసాద్, ఆయా కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు