ప్రతి కార్డుదారుడికి దీపం గ్యాస్‌ కనెక‌్షన్‌

17 Apr, 2017 22:42 IST|Sakshi
– నగదురహిత లావాదేవీలపై మరింత దృష్టి
– కొత్త డీఎస్‌ఓ వేము సుబ్రహ్మణ్యం వెల్లడి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ప్రతి రేషన్‌ కార్డుదారుడికి దీపం పథకం కింద గ్యాస్‌ కనెక​‍్షన్‌ ఇప్పించి, ప్రజా పంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచడం ప్రధాన లక్ష్యమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్‌ఓ) వేము సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం కొత్త డీఎస్‌ఓగా ఆయన  బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జాయింట్‌ కలెక్టర్‌ సి.హరికిరణ్‌కు బొకే సమర్పించి జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. అనంతరం  ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  తూర్పుగోదావరి జిల్లా కాకి నాడకు చెందిన తాను మచిలీపట్నం ఏఎస్‌ఓగా పనిచేస్తూ శ్రీకాకులం జిల్లా ఇన్‌చార్జీ డీఎస్‌ఓగా 15 నెలలు బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. అక్కడి నుంచి పదోన్నతిపై కర్నూలు జిల్లాకు వచ్చినట్లు వివరించారు. జూన్‌ 2వ తేదీ లోగా తెల్ల కార్డుదారులందరికీ దీపం పథకం కింద గ్యాస్‌ కనెక‌్షన్‌ ఇస్తామన్నారు. కొత్త డీఎస్‌ఓను ఆఫీసు సూపరింటెండెంటు రాజరఘువీర్, అర్బన్‌ ఏఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి, సీఎస్‌డీటీలు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు అభినందించారు.
 
మరిన్ని వార్తలు