వారం రోజుల్లో దీపం కనెక‌్షన్లు

22 May, 2017 23:56 IST|Sakshi
వారం రోజుల్లో దీపం కనెక‌్షన్లు
- ప్రతి పంచాయతీలో రెండు ఫాంపాండ్స్‌
- జిల్లా కలెక్టర్‌ ఎస్‌ సత్యనారాయణ
 
కర్నూలు(అర్బన్‌): దీపం కనెక‌్షన్ల గ్రౌడింగ్‌లో అన్ని జిల్లాల కంటే కర్నూలు జిల్లా అత్యంత దిగువ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గ్యాస్‌ కనెక‌్షన్లు, ఉపాధిలో లేబర్‌ బడ్జెట్, ఎన్‌టీఆర్‌ హౌసింగ్‌ నిర్మాణాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓ, డీఆర్‌డీఏ ఏపీఎంలకు దిశా నిర్దేశం చేశారు. వారం రోజుల్లో పెండింగ్‌లో ఉన్న కుటుంబాల సర్వేతో పాటు ఒకేసారి గ్యాస్‌ కనెక‌్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్యాస్‌ కనెక‌్షన్ల పంపిణీలో జిల్లా లక్ష్యం 1.50 లక్షలు కాగా, ఇప్పటి వరకు 2132 మాత్రమే గ్రౌండింగ్‌ అయ్యాయన్నారు. జిల్లాలో ఉపాధి పథకం పనుల కింద లేబర్‌ బడ్జెట్‌ తక్కువగా నమోదవుతున్నట్లు చెప్పిన ఆయన ప్రగతి తక్కువగా ఉన్న మండలాల ఏపీఓలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో వారానికి రెండు ప్రకారం ఫాంపాండ్స్‌ పనులు పూర్తి చేయాలన్నారు.  వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్, జెడ్పీ సీఈఓ బీఆర్‌ ఈశ్వర్, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ సుబ్బారెడ్డి, హౌసింగ్‌, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు హుసేన్‌సాహెబ్, డా.సీహెచ్‌ పుల్లారెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా