భద్రాచలం జిల్లా కోసం ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష

7 Oct, 2016 03:50 IST|Sakshi
రాజయ్య దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న పోతినేని

భద్రాచలం: ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను జిల్లా కేం ద్రం చేయాలని, వాజేడు, వెం కటాపురం మండలాలను భూపాలపల్లిలో  కలపొ ద్దంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమరం ఫణీశ్వరమ్మ వేర్వేరు శిబిరాల్లో గురువారం ఆమరణ దీక్ష చేపట్టారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్  మాట్లాడుతూ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందాన టీఆర్‌ఎస్  ప్రభుత్వం రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తోందన్నారు. కేసీఆర్ సొంత జాగీరులా వ్యవహరిస్తూ.. స్వార్థ రాజకీయాల కోసం బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు జిల్లాలను మంత్రులకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. భద్రాచలం జిల్లా చేయాలని తాము మొదటి నుంచీ పట్టుబడుతున్నామని గుర్తుచేశారు.
 
నా ప్రాణాలైనా ఇస్తా: ఫణీశ్వరమ్మ
ఆమరణ దీక్షకు దిగిన టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి కొమరం ఫణీశ్వరమ్మ మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన భద్రాచలంపై సీఎం కేసీఆర్‌కు ఎందుకింత చిన్నచూపు అని ఆమె ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ, న్యూడెమోక్రసీతోపాటు దళిత, ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించారుు. భద్రాచలం కేంద్రంగా ఆదివాసీ జిల్లా చేయాలనే డిమాండ్‌తో గిరిజన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య వెంకటాపురంలో పాదయాత్ర చేపట్టారు.

>
మరిన్ని వార్తలు