పంట నష్టపరిహారం ఇవ్వాలి

22 Aug, 2016 22:35 IST|Sakshi
పంట నష్టపరిహారం ఇవ్వాలి
  • సీపీఐ డిమాండ్‌ 
  • కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

  • అనంతపురం అర్బన్‌ : 

    వేరుశనగ పంటకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.  సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయ నాసిరకంగా ఉండడంతో ఊడలు దిగలేదన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు ఏకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సహాయ కార్యదర్శులు సి.జాఫర్, పి.నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సి.మల్లికార్జున, ఎ.కాటమయ్య, మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, తదితరులు పాల్గొన్నారు.


    అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి
     అగ్రిగోల్డ్‌ మోసానికి గురైన వినియోగదారులు, ఏజెంట్లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం వామపక్ష నాయకులతో కలిసి బాధితులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను విక్రయించి బాధితులకు డిపాజిట్‌ మొత్తాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్, ఏఐటీయూసీ నాయకులు పీఎల్‌ నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు