పంట నష్టపరిహారం పంపిణీకి డిమాండ్‌

26 Sep, 2016 00:11 IST|Sakshi
కర్నూలు(అర్బన్‌): జిల్లావ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బీజీ మాదన్న, కే జగన్నాథం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 15 రోజులుగా కుందుకు వరద వచ్చి ఉద్ధతంగా పారుతుండడంతో ఉయ్యాలవాడ, నంద్యాల, కోవెలకుంట్ల, బనగానపల్లె మండలాల్లోని అనేక గ్రామాల రైతుల పంట పొలాలు నీట మునిగిపోయాయయని ఆదివారం వారు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా భూముల్లో వేసిన మొక్కజొన్న, మిరప, మినుము తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారన్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని, ఎకరాలకు రూ.20 వేల పరిహారం అందించాలని కోరారు. రబీ సీజన్‌లో ఇతర పంటల సాగుకు వీలుగా విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. 
 
>
మరిన్ని వార్తలు