విషజ్వరాలు విజృంభణ

27 Aug, 2016 20:48 IST|Sakshi
విషజ్వరాలు విజృంభణ
ముచ్చింతాలలో ఒకరి మృతి
పది రోజుల్లో పది మృతి కేసుల నమోదు
డెంగీ లక్షణాలతో పలువురు విజయవాడ, ఖమ్మం ఆస్పత్రుల్లో చేరిక
 
ముచ్చింతాల(పెనుగంచిప్రోలు) :
పల్లెలు పడకేస్తున్నాయి. విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకు గ్రామాలగ్రామాలు జ్వరాల బారినపడుతున్నాయి. అక్కడక్కడ డెంగీ లక్షణాలతో అనేక కేసులు నమోదవుతున్నాయి. విషజ్వరంతో గ్రామానికి చెందిన కనపర్తి పుల్లయ్య(45) మృతి శనివారం చెందాడు. ఐదు రోజుల క్రితమే అతని సోదరుడు జోజి(41) మృతి చెందాడు. వీరిద్దరు ప్లేట్‌లెట్స్‌ పడిపోయి మృతి చెందినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పది రోజుల్లో గ్రామంలో మొత్తం నలుగురు మృతి చెందినట్లు సమాచారం. అలాగే పుల్లయ్య భార్య మేరి, జోజి భార్య జయమ్మ, కుమారుడు వీరస్వామి కూడా తీవ్ర జ్వరంతో ప్లేట్‌లెట్స్‌ తగ్గి పూర్తిగా నీరసించి పోవటంతో శనివారం సాయంత్రం ప్రత్యేక వాహనంలో విజయవాడ తరలించారు. ఒక పక్క కుటుంబ సభ్యులు చనిపోయి ఉండగా మరోపక్క ఒకొక్కరికి విషజ్వరాలతో ఆస్పత్రికి చేరుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కాలనీకి చెందిన 20 మంది వరకు ప్లేట్‌లెట్స్‌ తగ్గి డెంగీ లక్షణాలతో విజయవాడ, ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తక్షణం జిల్లా అధికారులు స్పందించి గ్రామంలో గ్రామంలో రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని కోరుతున్నారు. 
 
 
 
మరిన్ని వార్తలు