రైల్వే కోర్టుకు డిప్యూటీ సీఎం..

19 Sep, 2017 12:34 IST|Sakshi
రైల్వే కోర్టుకు వచ్చిన డిప్యూటీ సీఎం శ్రీహరి

కాజీపేట రూరల్‌ : కాజీపేట రైల్వే కోర్టుకు సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. రైల్వే కోర్టు పోలీస్‌లు, న్యాయవాది చింతం సదానందం తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2014లో కడియం శ్రీహరి, నాయకురాలు మమత కాజీపేట రైల్వే స్టేషన్‌ సమీపంలోని నష్కల్‌లో రైలురోకో చేశారు. ఈ మేరకు శ్రీహరి, మమతపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో శ్రీహరి, మమత రైల్వే కోర్టులో హాజరుకాగా.. ఎగ్జామినేషన్‌ తర్వాత కేసు 2017 అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేస్తు మెజిస్ట్రేట్‌ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. రైల్వే కోర్టుకు వచ్చిన కడియం శ్రీహరిని వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు కలిశారు.  

కిషన్‌రెడ్డి, సునీత..
భువనగిరి రైలురోకో కేసుల్లో సోమవారం బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చింత సాంబమూర్తి, మనోహర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌కు చెందిన ఆలేరు ఎమ్మెల్యే సునీతతో పాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు నాయకులు కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యారు. ఎగ్జామినేషన్‌ తర్వాత మెజిస్ట్రేట్‌ 2017 అక్టోబర్‌ 9వ తేదీకి కేసు వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపా రు. రైల్వే కోర్టుకు వచ్చిన కిషన్‌రెడ్డి, రాష్ట్ర నేతలు చింత సాంబమూర్తి, మనోహర్‌ రెడ్డికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పార్టీ అర్బన్, రూ రల్‌ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, అర్బన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తరవి, ఉడుతల బాబురావు, శివ, సదానందం స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు