అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి

12 Dec, 2016 14:48 IST|Sakshi
అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
సమయపాలన పాటించాలి
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక
 

ఉట్నూర్ : గిరిజన దర్భార్‌కు వచ్చె అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించకుండా తక్షణమే వచ్చిన అర్జీలను క్షేత్ర స్థారుులో పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చెపట్టాలని స్పెషల్ డీప్యూటి కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యలయంలో నిర్వహించిన గిరిజన దర్భార్‌లో అమె గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గిరిజనుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం చెయ్యవద్దాన్నారు. ప్రతి అర్జీని సంబందింత అధికారులు క్షేత్ర స్థారుులో పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొవాలన్నారు.  ప్రతి వారం నిర్వహించు దర్భార్‌కు కొన్ని విభాగాల అధికారులు సమయపాలనా పాటించడం లేదని వారిపై చర్యలు తప్పావన్నారు.

దర్భారుకు వచ్చిన అర్జీలు
తనకు ఐటీడీఏ ద్వారా స్వయం ఉపాధి రుణం మంజూరు అరుు్యందని అందుకు సంబందించిన సబ్సిడీ మంజూరు చెయ్యాలని భోథ్ మండలం ఖర్దుకు చెందిన పెందోర్ దెవ్‌రావ్ అర్జీ పెట్టుకున్నాడు. తన కుటుంబ పోషణ కోసం కిరాణ దుకాణం పెట్టుకోవడానికి రుణం అందించాలని సిర్పూర్(యు) మండలం నెట్నూర్‌కు చెందిన గోడం నేతబారుు విన్నవించింది. తన వ్యవసాయ భూమికి నీటి సౌకర్యం లేక సాగు చెయ్యలేక పోతున్నానని బావి నిర్మించాలని గాదిగూడ మండలం  అర్జునికి చెందిన కొడప కట్టు విన్నవించాడు. జీవనోఫాది కోసం మిని డైరి ఫాం పెట్టుకొడానికి రుణం మంజూరు చెయ్యాలని గుడిహత్నుర్ మండలం తోషంకు చెందిన ప్రెమ్‌సింగ్ వేడుకున్నాడు. తన వ్యవసాయభూమి సాగు కోసం స్పింక్లర్లు మంజూరు చెయ్యాలని ఉట్నూర్ మండలం చింతకర్రకు చెందిన సిడాం తుకారం అర్జీ పెట్టుకున్నాడు. తన పంట పోలాల సాగు కోసం ఎండ్ల జత మంజూరు చెయ్యాలని ఆసిఫాబాద్ మండలం కతోడకు చెందిన ఆత్రం భీంబారుు విన్నవించింది.

తన సాగు భూమి అక్రమణ కేసులో ఉండటంతో సాగు చెసుకోలేక పోతున్నానని కేసును వెంటనే విచారణ చేపట్టాలని మందమర్రి మండల కేంద్రానికి చెందిన రమేశ్ వేడుకున్నాడు. తన వ్యవసాయ భూమికి త్రీపేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఇచ్చోడ మండలం బాబ్జిపెట్‌కు చెందిన టెకం దెవ్‌రావ్ విన్నవించాడు. తమ గ్రామంలో మంచినీటి పథకం లేక పోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తమ గ్రామంలో మంచినీటి పథకం నిర్మించాలని గాదిగూడ మండలం ఆద్మీయాన్‌కు చెందిన జుగ్నాక జుగాదిరావ్ వేడుకున్నాడు. తన కుటుంబ పోషణ కోసం 108 లేదా 104 వాహన డ్రైవర్‌గా ఉద్యోగం కల్పించాలని జైనూర్ మండలం ఉషేగాంకు చెందిన నాగోరావ్ అర్జీ పెట్టుకున్నాడు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్,  తహసీల్దార్ రమేశ్, ఏంపీడీవో లక్ష్మణ్ వివిధ విభాగాల అధికారులు పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు