అన్నీ ఉంటేనే అనుమతి

16 Oct, 2016 22:43 IST|Sakshi

–పాఠశాలకు యూడైస్‌ కోడ్‌ తప్పనిసరి
– చైల్డ్‌ ఇన్‌ఫోలో విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి
–ఆధార్‌ కూడా ఉండాలి
–ఇవి లేకపోతే పది పరీక్షలకు నో ఎంట్రీ


అనంతపురం ఎడ్యుకేషన్‌ : పదో తరగతి విద్యార్థులకు సంబంధించి  అన్ని వివరాలు చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు చేశారా? మీ పాఠశాలకు యూడైస్‌ కోడ్‌ ఉందా? విద్యార్థికి సంబంధించి ఆధార్‌కార్డు వచ్చిందా? స్కూల్‌లో అనుమతి ఉన్న సెక్షన్లకు మించి విద్యార్థులు ఉన్నారా?.. ఈ వివరాలన్నీ ఒకసారి సరిచూసుకోండి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీ మూల్యం తప్పదు.
    దేశ వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలకు యూనిక్‌ నంబర్‌ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో యూనిఫైడ్‌ yì స్ట్రిక్ట్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సిస్టం (యూడైస్‌) జాబితాలో పాఠశాల పేరు ఉంటేనే అది ప్రభుత్వ లెక్కలో ఉన్నట్టు. ఒకవేళ  ప్రభుత్వ గుర్తింపు ఉండి.. యూడైస్‌ కోడ్‌ లేకపోయినా ఆ పాఠశాలను పరిగణనలోకి తీసుకోరు.  దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఒక నంబరు కేటాయిస్తారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరొక స్కూల్‌కు ఇవ్వరు. వాస్తవానికి 2008లోనే యూడైస్‌ కోడ్‌ అమలులోకి వచ్చింది.  ప్రైవేట్‌  పాఠశాలల నిర్వాహకుల్లో చాలామందికి అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం కారణంగా యూడైస్‌ కోడ్‌కు దరఖాస్తు చేసుకోలేదు. అయితే.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం  తప్పనిసరి చేయడంతో నిర్వాహకులు హడావుడిగా యూడైస్‌ కోడ్‌ తీసుకుంటున్నారు.

చైల్డ్‌ఇన్‌ఫోలో వివరాల నమోదు
 విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలను ఆన్‌లైన్‌ చేయడంలో భాగంగా ‘చైల్డ్‌ఇన్‌ఫో’ నమోదు కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.  యూడైస్‌ జాబితాలో ఉన్న 1–10 తరగతుల విద్యార్థులకు సంబంధించి పూర్తి వివరాలు చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయాలి.  విద్యార్థిపేరు, తరగతి,  ఊరు, కులం, తల్లిదండ్రులు, వార్షిక ఆదాయం, ఆధార్‌నంబరు ..ఇలా  24 అంశాలను పొందుపర్చాలి.  ఒక విద్యార్థ వివరాలు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం ఉంది.  అయితే.. జిల్లాలో ఇంకా 26 వేల మంది వివరాలను నమోదు చేయలేదు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 1–10 తరగతుల విద్యార్థులు 5,54,543 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటిదాకా 5,28,543 మంది వివరాలను నమోదు చేశారు. తక్కిన విద్యార్థుల్లో ఎక్కువమంది ప్రైవేట్‌ పాఠశాలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

యూడైస్, చైల్డ్‌ఇన్‌ఫో వివరాలుంటేనే ఎన్‌ఆర్‌లు తీసుకుంటాం – గోవిందునాయక్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌
ఈ  విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు కచ్చితంగా చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేసి ఉండాలి. ఆధార్‌కార్డు కూడా కల్గివుండాలి. చదువుతున్న స్కూల్‌కు యూడైస్‌ కోడ్‌ తప్పనిసరి. ఇవి లేకపోతే ఆయా విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ తీసుకోము. అలాగే ఎన్ని సెక్షన్లకు అనుమతి తీసుకున్నారో అంతేమంది విద్యార్థులుండాలి. ఎక్కువగా ఉంటే అదనపు సెక్షన్‌కు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఆ విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోం. పైగా ఈ విద్యా సంవత్సరం నుంచి ‘వితౌట్‌ స్కూల్‌ స్టడీ’ ఉండదు. అలాంటి వారికి ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పరీక్ష ఫీజు కట్టించాల్సి ఉంటుంది.

విద్యార్థులకు తీవ్ర నష్టం – దశరథరామయ్య (ఎస్‌ఎస్‌ఏ పీఓ), అంజయ్య (డీఈఓ)
విద్యార్థుల వివరాలు చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఫలాలూ అందవు.  నమోదు కాని విద్యార్థులు నష్టపోతారు.  ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చొరవ చూపి    ఛిజ్చిజీlఛీజీnజౌ.్చp.nజీఛి.జీn వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి.

మరిన్ని వార్తలు