నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి

17 Feb, 2017 00:17 IST|Sakshi
నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి
- ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ పీజీ కృష్ణ
- ఘనంగా సిల్వర్‌ జూబ్లీ కళాశాల వార్షికోత్సవం
 
కర్నూలు(అర్బన్‌): విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని ఎన్‌సీసీ కర్నూలు గ్రూప్‌ కమాండర్‌ కల్నల్‌ పీజీ కృష్ణ అన్నారు. సిల్వర్‌ జూబ్లీ కళాశాల వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో ఒత్తిడి సహజమని దాన్ని అధిగమిస్తే విజయం సొంతమవుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థి సుబ్బారెడ్డి, సిల్వర్‌ జూబ్లీ ఫ్రెటర్నిటీ అధ్యక్షుడు డాక్టర్‌ జీవీ రమణయ్య, కళాశాల ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖాదర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సునీత పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు