వేగంగా అభివృద్ధి పనులు

11 Nov, 2016 01:02 IST|Sakshi
  • అధికారులకు కలెక్టర్‌ ఆదేశం
  • కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : 
    రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజ¯ŒS పరిధిలో నడుస్తున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో డివిజ¯ŒSలోని తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారికి అవి నిర్మించే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అన్నారు. గతంలో నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగిస్తున్నదీ లేనిదీ గుర్తించి, వాడకంలో లేని మరుగుదొడ్లు వినియోగించేలా చైతన్యపరచాలన్నారు. ఎన్టీఆర్‌ జలసిరి పథకంలో 200 అడుగుల లోతు లోపు బోర్లు వేసేవారికి సౌర పంపుసెట్లు అందించాలన్నారు. డంపింగ్‌యార్డులు లేని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు. పనులు పూర్తయిన వెంటనే సొమ్ము చెల్లిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న పనులకు ఇసుక కొరత ఉండదని, జిల్లాలోని ఇసుక రీచ్‌ల ద్వారా ఇసుక సరఫరాకు అనుమతించామన్నారు. సబ్‌కలెక్టర్‌ విజయకృష్ణన్, గృహనిర్మాణ సంస్థ డీఈ సెల్వరాజ్, డీఆర్‌డీఏ పీడీ ఎస్‌.మల్లిబాబు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎం రాజేశ్వరరావు, హౌసింగ్‌ ఈఈ శ్రీనివాసరావు, డివిజనల్‌ పంచాయతీ అధికారి ఎం.వరప్రసాద్, జిల్లా సహకారాధికారిణి ప్రమీల, డివిజ¯ŒSలోని తహసీల్దార్లు, ఎండీఓలు, పంచాయతీ కార్యదర్శులు, మండల ఇంజనీర్లు, ఏపీఎంలు పాల్గొన్నారు.
     
     
మరిన్ని వార్తలు