గ్రామీణ మహిళల అభివృద్ధికే కృషిమార్ట్‌లు

26 Oct, 2016 01:48 IST|Sakshi
గ్రామీణ మహిళల అభివృద్ధికే కృషిమార్ట్‌లు

ఏన్కూరు: గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి కోసం కృషిమార్‌‌టలు ఏర్పాటు చేశామని ప్రపంచబ్యాంక్ టాస్ టీమ్ లీడర్ వినయ్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని కృషిమార్ట్‌ను మంగళవారం ప్రపంచబ్యాంకు బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కృషిమార్ట్ లోని నిత్యావసర వస్తువులు, వాటి నాణ్యత, ధరల వివరాలు, క్రయ, విక్రయాలగురించి తెలుసుకున్నారు. ఏన్కూరులోని కిరాణా దుకాణా న్ని, తూతకలింగన్నపేటలోని చిరువస్తువుల తయారీ కేంద్రాన్ని వారు పరిశీలించారు. అనంతరం స్థానిక ఐకేపీ కార్యాలయంలో భవిత మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా వినయ్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. నిరుపేదలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు అందించేందుకు కృషిమార్ట్‌లు ఏర్పాటు చేశామని, తెలంగాణ రాష్ట్రంలో రూ.642కోట్లతో 150మండలాల్లో ఈ పథకం అమలు చేస్తున్నామని వివరించారు. ఏన్కూరు మండలంలో 44మహిళా సంఘాలున్నాయని 31సంఘాల మహిళలు నిత్యావసర వస్తువులు విక్రరుుస్తున్నట్లు చెప్పారు. మిగతా గ్రూపులుకూడా నిత్యావసరవస్తువులు విక్రరుుంచేందుకు వారికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు తయారు చేసుకున్న పచ్చళ్లు, వస్తువులను కూడా కృషిమార్ట్ ద్వారా విక్రరుుంచుకోవచ్చని సూచించారు.
 
 కృషిమార్ట్ ద్వారా నాణ్యమైన నిత్యావసర వస్తువులు తక్కువధరలకు దొరుకుతున్నాయని ప్రచారం చేయడంతో విక్రయాలుపెరిగి కృషిమార్ట్‌లకు ఆదాయం ఎక్కువ వస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రపంచబ్యాంకు బృందం సభ్యులు బాలకృష్ణ, రాజేష్, ప్రదీప్, ఐకేపీ ఏపీఎం సురేంద్రబాబు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు