అద్దె ఇంట్లో ఉంటున్న ఏపీ మంత్రి

13 Jul, 2016 10:47 IST|Sakshi
సర్వేలో భాగంగా మంత్రి దేవినేని ఉమాకు ఐరిస్ తీస్తున్న సిబ్బంది

విజయవాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన ఆస్తుల వివరాలు వెల్లడించలేదు. తనకు గజం స్థలం కూడా లేదని, కృష్ణా జిల్లా గొల్లపూడిలోని అద్దె ఇంట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మంగళవారం గొల్లపూడిలో మంత్రి ఇంటి నుంచి ప్రజాసాధికారిక సర్వే ప్రారంభించిన అధికారులకు ఆయన ఈ వివరాలు ఇచ్చారు.

అధికారులకు తన ఆధార్, ఓటరుకార్డులోని విషయాలు మాత్రమే అందచేశారు. ఆస్తులకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదు. ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎన్యూమరేటర్ నిర్మలకుమారి ఈ వివరాలను నమోదుచేసుకున్నారు.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు