దేశప్రతిష్ట పెంచేందుకు కృషి చేయాలి

7 Sep, 2016 17:34 IST|Sakshi
వాలీబాల్‌ సర్వీస్‌ చేస్తున్న ఎమ్మెల్యే
  • జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
  • ఓల్డ్‌ హైస్కూల్‌లో ఆటలపోటీలు ప్రారంభం
  • జగిత్యాల రూరల్‌ : క్రీడాకారులు దేశప్రతిష్టను నిలబెట్టేలా పతకాలు సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓల్డ్‌ హైస్కూల్‌లో జగిత్యాల జోనల్‌స్థాయి ఆటల పోటీలు ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువ నిధులు కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు లేకుండా క్రీడలు నిర్వహిస్తున్న పీఈటీల కృషి అభినందనీయమన్నారు. ఇటీవల ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా స్వయం కృషితో పతకం తీసుకువచ్చి దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పీఈటీలు కోటేశ్వర్‌రావు, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే సన్మానించారు.
    కార్యక్రమంలో ఓల్డ్‌ హైస్కూల్‌ హెచ్‌ఎం పద్మాకర్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు బోనగిరి దేవయ్య, ఎస్‌కేఎన్‌ఆర్‌ పీడీ రవికుమార్, ఎస్‌జీఎఫ్‌ జోనల్‌ సెక్రటరి గంగారాం, పీఈటీలు నాగేందర్‌కుమార్, అజయ్‌బాబు, రాజిరెడ్డి, కోటేశ్వర్‌రావు, దత్తాత్రి, సాగర్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, శ్రీనివాస్, వెంకటలక్ష్మీ, జమున, మల్లీశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు