తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

23 Jul, 2016 08:03 IST|Sakshi

తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు. నడకదారిలో వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని శనివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ మంత్రి ఏ.చందూలాల్, హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్రావు, ఉడిపి పిఠాధిపతులు దర్శించుకున్నారు. వారిని ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శుక్రవారం 72,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు