రాజమహేంద్రవరంలో పోటెత్తిన భక్తులు

8 Aug, 2016 09:47 IST|Sakshi

రాజమహేంద్రవరం:  గోదావరి అంత్యపుష్కరాలు సోమవారం తొమ్మిదో రోజుకు చేరాయి. పుణ్యస్నానం ఆచరించడానికి సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్లన్ని భక్తులతో కిటకిటలాడాయి. అయితే గోదావరిలోకి వరద నీరు భారీగా తరలి వస్తుంది. ఈ నేపథ్యంలో నదిలో నీరు  ఉధృతంగా ప్రవహిస్తుంది.

దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమైయ్యారు. నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులకు పలు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, గన్నవరం, పెరవలి మండలం తీపర్రు, పెనుగొండ మండలం సిద్ధాంతం, నిడదవోలు మండలం పెండ్యాలతో పాటు కోవ్వూరులోని  గోష్పాద క్షేత్రాల్లో భక్తులు పుణ్య స్నానాలు చేసేందుకు భారీగా తరలి వచ్చారు.

కోవ్వూరులో సోమవారం వేకువజాము నుంచి గౌతమి ఘాట్‌లో దాదాపు 50వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. గోదావరి వరద ఉధృతి కారణంగా మూడు ఘాట్లలో రెండింటిని అధికారులు మూసివేశారు. ఈ నెల 11వరకు అంత్య పుష్కరాలు కొనసాగుతాయి.

>
మరిన్ని వార్తలు