పోటెత్తిన భక్తజనం

20 Aug, 2016 18:35 IST|Sakshi
పోటెత్తిన భక్తజనం

అట్లూరు:

లంకమల్లేశ్వర అభయారణ్యంలో వెలసిన శ్రీకొండగోపాలస్వామి ఆలయం శ్రావణ మాస మూడవ శనివారం భక్తులతో పోటెత్తిపోయింది. ప్రతిఏటా శ్రావణ మాసంలో వచ్చే శనివారాలలో స్వామి వారికి పూజలు చేయడం, భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం ఆనవాయితి. అందులో భాగంగా శనివారం భక్తులతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరాలతో  పోటెత్తిపోయింది. ఉదయం ఆరు గంటలకే భక్తులు ఆలయ ప్రాంగణానికి చేరుకుని స్వామి దర్శనానికి క్యూకట్టారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు తిలకించేందుకు రాష్ట్ర అవార్డు గ్రహిత పొత్తపి కొండయ్యచే పండరిభజన కార్యాక్రమం నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయకమిటీ అన్నదాన కార్యక్రమంతో పాటు
తాగునీరు తదితర వసతులు కల్పించారు.

మరిన్ని వార్తలు