అమరపురి.. జన ఝరి

22 Aug, 2016 21:36 IST|Sakshi
అమరపురి.. జన ఝరి
* వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
* లక్షన్నర మంది అమరేశ్వరుని దర్శనం
*  నేడు అమ్మవారి తెప్పోత్సవం 
 
అమరావతి (పట్నంబజారు): అమరావతి ప్రధాన రహదారులన్నీ సోమవారం పుష్కర భక్త జనం కిటకిటతో జనసంద్రంగా మారాయి. ఒకవైపు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా  ప్రత్యేక పూజలు, హోమాలు, మరోవైపు అన్నదాన శిబిరాలు, వటంటీర్ల సేవలు,  పుష్కర స్నానాలు, పిండప్రదాన కార్యక్రమాలతో అమరావతిలో పుష్కర శోభ సంతరించుకొంది. పవిత్ర కృష్ణవేణికి హారతులు ఇచ్చి  పూజలు నిర్వహించారు. శనివారం నుంచి అమరావతిలో పెరిగిన రద్దీ కొనసాగుతూనే ఉంది.  మంగళవారంతో పుష్కరాలు ముగియనున్న నేప్యథంలో సోమవారం రద్దీ బాగా పెరిగింది. అమరావతిలోని మూడు ఘాట్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకే సుమారు లక్షన్నరకు పైగా భక్తులు సాన్నాలు ఆచరించి ఉంటారని అధికారులు అంచనా చేశారు. శివునికి ప్రీతిపాత్రమైన రోజు కావటంతో భక్తులు ఆలయానికి విశేషంగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అభిషేకాలు, విశేష పూజలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం తిరుమలతిరుపతి దేవస్థానం ఆ«ధ్వర్యంలో పలు ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. 
 
ఆత్మహత్య చేసుకున్న రైతులకు పిండ ప్రదానం..
అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో స్వచ్ఛంద సంస్థలు భోజన ఏర్పాట్లును చేస్తున్నాయి. సత్యసాయి సేవాసంఘం, చోడవరం లలితా పీఠం, బ్రాహ్మణ సేవా సమితి తదితర సంస్థల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. రెyŠ క్రాస్, టీటీడీ సంస్థల  నుంచి వచ్చిన విద్యార్థులు భక్తులకు విశేష సేవలు అందించారు. చోడవరం శ్రీలలితా పీఠం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం యాగం, సహస్ర చండీ మంత్రోచ్ఛరణ, సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నారు.  ఆర్టీసీ రీజయన్‌ మేనేజర్‌ జ్ఞానంగారి శ్రీహరి సిబ్బంది పనితీరు, బస్సుల నిర్వహణను పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ పిండ ప్రదానాలు చేశారు. 
 
నేడు మరింత పెరిగే అవకాశం...
మంగళవారం పుష్కరాల ఆఖరి రోజు కావటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా భక్తులు వచ్చినా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
మరిన్ని వార్తలు