బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి

20 Jan, 2017 22:53 IST|Sakshi
బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి
  • స్కీమ్‌ వర్కర్ల డిమాండ్‌  
  •  కలెక్టరేట్‌ వద్ద ధర్నా
  • కాకినాడ సిటీ : 
    ఐసీడీఎస్, ఎ¯ŒSహెచ్‌ఎం, మిడ్డేమీల్స్, ఐకేపీ, సర్వశిక్షాభియాన్, ఉపాధి  పథకాలకు కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలని స్కీం వర్కర్లు డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా, ప్రదర్శన నిర్వహించారు. సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని, 45వ ఎల్‌ఐసీ సిఫార్సులను అమలు చేయాలని, సంక్షేమ పథకాలను ప్రైవేటీకరణ చేయరాదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి సంఘీభావం ప్రకటించి స్కీం వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్, ఎంప్లాయీస్‌ యూనియ¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు కట్టబెడుతూ, ప్రజలకు ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలకు కోత పెట్టడం అన్యాయమన్నారు. స్కీం వర్కర్ల జిల్లా నాయకురాలు ఎం.వీరలక్ష్మి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్‌ అజయ్‌కుమార్, సీపీఎం పట్టణ కార్యదర్శి పలివెల వీరబాబు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియ¯ŒS నాయకులు తుపాలకుల వీర్రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, అంగ¯ŒSవాడీ నాయకులు కృష్ణకుమారి, శాంతాలక్ష్మి, ఆశ, మిడ్డేమీల్స్‌ సంఘాల ప్రతినిధులు బేబిరాణి, రమణాబాయి పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు